Home /News /movies /

THE ACTION GLIMPSE FROM NITHIIN MOVIE MACHERLA NIYOJAKAVARGAM WILL BE OUT TOMORROW SB

Nithiin: మాచర్ల నియోజకవర్గం నుంచి మరో క్రేజీ అప్ డేట్..బీ రెడీ అంటోన్న నితిన్.. !

NIthiin Photo : Twitter

NIthiin Photo : Twitter

మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగష్టు 12, 2022 న విడుదల కానుందని టీమ్ ప్రకటించింది. అయితే అదే రోజున సమంత నటిస్తున్న యశోద, అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏజెంట్‌‌ కూడా విడుదలకానున్నాయి.

    నితిన్‌ హీరోగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజకవర్గం (macherla niyojakavargam movie) అనే చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నితిన్ సరసన హీరోయిన్‌గా  చేస్తోంది. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు.   కృతి శెట్టితో పాటు.. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కేథరిన్ కూడానటిస్తోంది. ఈ చిత్రం విడుదల ఎప్పుడు కానుందో టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం ఆగష్టు 12, 2022 న విడుదల కానుందని టీమ్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ కూడా వచ్చింది.

    మాచర్ల నియోజకవర్గం యాక్షన్ గ్లింప్స్‌ను రేపు ఉదయం 11.03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు నితిన్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాను ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్‌.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చారు.



    ఇప్పటికే విడుదలైన 'రా రా రెడ్డి' యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.గత 11 రోజులుగా యూట్యూబ్ మ్యూజిక్ నెంబర్ 1 గా ట్రెండింగ్‌లో ఉంది.  నితిన్, అంజలి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ , కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. ఇక మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ జూలై 30న నిర్వహించనున్నారు.

    అయితే గతేడాది హీరో నితిన్ మూడు సినిమాలతో పలకరించారు. ‘రంగ్ దే’, చెక్’ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత చేసిన    మ్యాస్ట్రో (Maestro)చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా  ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల చేస్తే  మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంతో మంచి హిట్టు కొట్టాలని నితిన్ భావిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఆగష్టు 12, 2022 న విడుదల కానుందని టీమ్ ప్రకటించింది. అయితే అదే రోజున సమంత నటిస్తున్న యశోద, అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏజెంట్‌‌ కూడా విడుదలకానున్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. అయితే నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాను మొదట జూలై 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ఆ తర్వాత వాయిదా వేశారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Krithi shetty, Nithiin

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు