రాహుల్ గాంధీలా నటించినందకు తనపై తనకే చాల అసహ్యం వేసిందని ప్రముఖ నటుడు అర్జున్ మాథుర్ చెప్పడం ఇపుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నటుడు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ..ప్రధాన మంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమాలో రాహుల్ గాంధీ పాత్రలో నటించాడు. విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని సాధించలేదు. ఈ సినిమాలోనే అర్జున్ మాథుర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాత్ర పోషించాడు. తాజాగా ఈ నటుడు ఒక షోలో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు.
మరోవైపు ఈ షోలో యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ బాలీవుడ్లో చక్కగా నటించని ఫేమస్ హీరో ఎవరు అని ప్రశ్నించగా.. దానికి అతను సిద్ధార్థ్ మల్హోత్ర పేరు చెప్పాడు. అతను మంచి నటుడు కాదనేది నా అభిప్రాయం. మరోవైపు ‘సంజు’ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినష్టర్’ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమాలు ఆ స్థాయిని చేరలేదనే దానిపై యాంకర్ ప్రశ్నించగా.. దానికి రాహుల్ పాత్రధారి అర్జున్ మాథుర్ మాట్లాడుతూ ‘సంజు’ మంచిగానే నడిచింది. కానీ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ విషయానికొస్తే ..ఆ సినిమాలో రాహుల్ పాత్రలో నటించినందుకు నాపై నాకే అసహ్యం వేసిందని చెప్పి సంచలనం సృష్టించాడు.
ఇక అర్జున్ మాథుర్ విషయానికొస్తే.. 2007లో ‘పాజిటివ్’ అనే బాలీవుడ్ షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ ప్రారంభించాడు. మరోవైపు జోయా అక్తర్ తెరకెెక్కించిన ‘లక్ బై ఛాన్స్’లో నటించి మంచి గుర్తింపు పొందాడు. అంతేకాదు బ్రిటిష్ డ్రామా సిరీస్‌లో నటించారు. అంతేకాదు అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’తో అర్జున్ మాథుర్‌కు బ్రేక్ లభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aicc, Anupam Kher, Arjun Mathur, Bollywood, Congress, Hindi Cinema, Kerala Lok Sabha Elections 2019, Lok Sabha Elections 2019, Manmohan singh, Political, Rahul Gandhi, Tollywood, Wayanad S11p04