హోమ్ /వార్తలు /సినిమా /

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్.. కేరాఫ్ కాంట్రవర్సీస్..

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్.. కేరాఫ్ కాంట్రవర్సీస్..

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’

మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ...ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో ‘ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.

ఇంకా చదవండి ...

    మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ...ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో ‘ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు.


    ఈ చిత్రాన్ని ప్రముఖ పాత్రికేయుడు అప్పటి ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ అనే పుస్తకం ఆధారంగా విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 2004 నుంచి 2014 మధ్యలో మన్మోహన్ సింగ్‌ను కీలుబొమ్మగా చేసి సోనియా, రాహుల్ గాంధీలు ఎలా ఈ దేశాన్ని పరిపాలించారనేది ఈ మూవీ ట్రైలర్‌లో చూపించారు.

    ' isDesktop="true" id="109252" youtubeid="q6a7YHDK-ik" category="movies">



    సంజయ్ బారు క్యారెక్టర్ చేసిన అక్షయ్ ఖన్నా..మహా భారతంలోనైనా రెండు ఫ్యామిలీలున్నాయి. కానీ ఇండియాలో ఒకే ఫ్యామిలీ ఉంది. అది గాంధీ ఫ్యామిలీ అంటూ దేశాన్ని ఆ కుటుంబం ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చూపించారు. అప్పటి పరిస్థితుల్లో ప్రధాని పదవి అధిష్టించిన మన్మోహన్ సింగ్‌ పరిపాలనలో తనదైన ముద్ర వేద్దామనుకున్నా... సోనియా, రాహుల్‌కు సంబంధించిన కాంగ్రెస్ వాళ్లు ఎలా ఇబ్బందులకు గురిచేసారో ఈ ట్రైలర్‌లో చూపెట్టారు.


    ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’


    అంతేకాదు ఈ మూవీలో మన్మోహన్ మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు క్యారెక్టర్ చెప్పిన నేను పీఎం కోసమే పనిచేస్తాను..పార్టీ కోసం కాదన్నప్పుడు..పీఎం కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తే అంటూ చెప్పిన డైలాగులు బాగున్నాయి. మొత్తం యూపీఏ పదేళ్ల కాలంలో జరిగిన కుంభకోణాలకు మన్మోహన్‌ను సోనియా, రాహుల్ ఎలా బలి చేసారన్నదే ఈ మూవీలో చూపెట్టనున్నారు.


    ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’


    ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌గా అనుపమ్ ఖేర్ ఆహార్యం అచ్చుగుద్దినట్టు సరిపోయింది. ఈ మూవీలో బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ పాత్రలో అవతార్ సాహ్ని నటించారు. మరోవైపు విమల్ వర్మ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌గా నటించాడు.


    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ (ట్విట్టర్ ఫోటో)


    అనిల్ రస్తోగి అనే నటుడు మాజీ కేంద్రమంత్రి శివరాజ్ పాటిల్ పాత్రలో నటిస్తే...మరోవైపు మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెర్ట్... ప్రియాంక గాంధీ పాత్రలో ఆహానా కుమ్ర యాక్ట్ చేసారు. ఈ మూవీని జనవరి 11న విడుదల చేయనున్నారు.



    ఇది కూడా చదవండి 


    2019లో విడుదల కాబోతున్న భారీ చిత్రాలు ఇవే..


    #HBD: బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్@53


    పూరి జగన్నాథ్ 'పండుగాడు'గా రామ్

    First published:

    Tags: Anupam Kher, Bollywood

    ఉత్తమ కథలు