మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ...2004లో ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో ‘ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ పాత్రికేయుడు అప్పటి ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ అనే పుస్తకం ఆధారంగా విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసాడు. 2004 నుంచి 2014 మధ్యలో మన్మోహన్ సింగ్‌ను కీలుబొమ్మగా చేసి సోనియా, రాహుల్ గాంధీలు ఎలా ఈ దేశాన్ని పరిపాలించారనేది ఈ మూవీ ట్రైలర్‌లో చూపించారు.దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ మూవీ దర్శక, నిర్మాతలు, నటుడు అనుఫమ్ ఖేర్‌పై మండిపడుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఈ చిత్రాన్ని తమ కోసం ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ మూవీ దర్శక,నిర్మాతలు కాంగ్రెస్ నేతల కోసం ఈ మూవీ ప్రత్యేక ప్రదర్శనలు వేయబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. కావాలంటే మన్మోహన్ సింగ్ కోరితే ఆయన కోసం స్పెషల్‌గా షో వేస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ సినిమా టీమ్‌కు భద్రత కల్పించాలని కోరుతూ బీజేపీ నేతలు కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్‌కు లేక రాశారు.
ఐతే అనుపమ్‌కు మద్దతుగా మాట్లాడే విషయంలో జ్వాలా గుత్తా ఎట్టకేలకు స్పందించారు. అప్పట్లో దీపికా పదుకొణే ప్రధాన పాత్రలో నటించిన ‘పద్మావత్’ సినిమా విషయంలో కొందరు మంత్రులు ఆమెను బెదిరించినపుడు అనుపమ్ ఖేర్ ఆమెకు అండగా నిలబడ్డారా లేదా అనే విషయం నాకు తెలుసుకోవాలని ఉందంటూ ప్రశ్నించింది.
why give an interview saying”I am not in politics I am just an actor doing my job”yet he didn’t condemned the open death threats by ministers of our country to #DeepikaPadukone a fellow actor a colleague a lady.WHY?? Rather it should have angered a senior artist like #AnupamKher
— Gutta Jwala (@Guttajwala) December 29, 2018
ఇప్పటికీ దానికి సరైప జవాబు దొరకడం లేదు. ఈ నిజం తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండంటూ జ్వాలా నెటిజన్లు ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి
#FlashBack2018: 2018 టాప్ 10 డిజాస్టర్స్.. అగ్రస్థానం మెగా ఫ్యామిలీదే..
#FlashBack2018: ఈ ఏడాది టాప్ హీరోయిన్లు వీళ్లే..
#FlashBack2018: సత్తా చూపించిన సినిమాలు ఇవే.. ‘రంగస్థలం’కే పట్టం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anupam Kher, Bollywood