THAT SENIOR STAR HERO SCOLDED MOHAN BABU ON STAGE AT THE PRESENCE OF SR NTR AND HERE THE STORY PK
Mohan Babu: వీడు దొంగ నా కొ.. ఎన్టీఆర్ ముందే మోహన్ బాబుపై ఆ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..
ఆలీతో సరదగా లో మోహన్ బాబు (Youtube/Photo)
Mohan Babu: ఇండస్ట్రీలో మోహన్ బాబు (Mohan Babu) గురించి ఎవరైనా మాట్లాడాలంటేనే భయపడుతుంటారు. ఎందుకంటే ఆయన కటౌట్ అలా ఉంటుంది మరి. ఎందుకొచ్చిన గోలరా బాబూ అంటూ మోహన్ బాబు గురించి ఎవరూ మాట్లాడరు కూడా. అలాంటి నటుడిని ఓ హీరో తిట్టాడు.
ఇండస్ట్రీలో మోహన్ బాబు గురించి ఎవరైనా మాట్లాడాలంటేనే భయపడుతుంటారు. ఎందుకంటే ఆయన కటౌట్ అలా ఉంటుంది మరి. ఎందుకొచ్చిన గోలరా బాబూ అంటూ మోహన్ బాబు గురించి ఎవరూ మాట్లాడరు కూడా. ఆయన గురించి అడగాలన్నా కూడా చాలా మంది ఆలోచిస్తుంటారు. తనను చూసి గౌరవించే వాళ్లలో 99 శాతం మంది కేవలం భయంతోనే అని చెప్తుంటాడు మోహన్ బాబు. అదే విషయం అలీతో సరదాగా షోలో కూడా చెప్పుకొచ్చాడు కలెక్షన్ కింగ్. తాజాగా ఈ షో 250వ ఎపిసోడ్కు వచ్చిన మోహన్ బాబు.. చాలా విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి ఏ మాత్రం మొహమాటం లేకుండా తెలిపాడు మోహన్ బాబు. ఒకటి కాదు రెండు ఎపిసోడ్స్ కింద మోహన్ బాబును ఇంటర్వ్యూ చేసాడు అలీ. తాజాగా రెండో ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో కూడా కీలకమైన విషయాల గురించి చర్చించారు.
మరీ ముఖ్యంగా మొదటి ఎపిసోడ్లో తనను అవమానించిన వాళ్ల గురించి చెప్పాడు మోహన్ బాబు. ఎన్టీఆర్ కెమెరామెన్, నిర్మాత పీతాంబరంతో పాటు మరో వ్యక్తి కూడా తనను జీవితంలో హైదరాబాద్ చూడగలవా అంటూ అవమానించారని చెప్పాడు మోహన్ బాబు. దాంతో పాటు తన జీవితంలోని వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకుల ముందుంచాడు కలెక్షన్ కింగ్. ఇప్పుడు రెండో ఎపిసోడ్లో అంతకంటే ఎక్కువ విషయాల గురించి చర్చించుకున్నట్లు అర్థమవుతుంది. అందులో దివంగత నేత పరిటాల రవి గురించి కూడా తెలిపాడు మోహన్ బాబు. ఆయనతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు ఈ సీనియర్ నటుడు.
అంతేకాదు.. తనను ఓ హీరో దొంగ నా కొడుకు అంటూ సంబోధించాడని.. అది కూడా ఎన్టీఆర్ ముందు ఆ మాట అన్నాడని చెప్పాడు మోహన్ బాబు. ఈ విషయం గురించి అలీ అడిగాడు. మిమ్మల్ని ఓ స్టార్ హీరో అందరి ముందు దొంగ నా కొ.. అన్నాడట కదన్నా అని అలీ అడగ్గానే.. మోహన్ బాబు జరిగిన విషయం బయటపెట్టాడు. తాను దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు, ఎన్టీఆర్, రజినీకాంత్ అంతా కలిసి ఒకే స్టేజీపై ఉన్నపుడు జరిగిన సంఘటన ఇది అంటూ తెలిపాడు ఈయన.
అందులో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నపుడు.. మోహన్ బాబు గురించి వెళ్లి మాట్లాడండి అంటే.. వీడి గురించి ఏం మాట్లాడాలి.. వీడు దొంగ నా కొడుకు అంటూ రజినీకాంత్ అన్నాడని చెప్పాడు మోహన్ బాబు. ఈ మాట అని వెంటనే నవ్వేసాడు.. రజినీ, మోహన్ బాబు ఎంత మంచి స్నేహితులు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అంత చనువుగా మాట్లాడుకుంటారు. రజినీకాంత్ నోటి నుంచి దొంగ నా కొ.. అనే మాట రాగానే.. పక్కనే ఉన్న ఎన్టీఆర్ ఏమది.. ఏమిటా భాష అంటూ సీరియస్ అయ్యారని మోహన్ బాబు చెప్పాడు. ఈ మొత్తం ఎపిసోడ్ ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియాలంటే మాత్రం అలీతో సరదాగా మోహన్ బాబు రెండో ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.