THAT DAY IS THE TURNING POINT IN MY LIFE SAYS JABARDASTH SUDIGALI SUDHEER MS
ఆరోజు నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ : సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ (File)
Sudigali Sudheer : ధన్య బాలకృష్ణన్ లాంటి హీరోయిన్,గౌతం రాజు వంటి టెక్నీషియన్లతో పనిచేయడం తన అదృష్టం అని చెప్పాడు.సినిమా బాగా వచ్చిందని.. ఇటీవలే మలేషియాలో చిత్రీకరించిన పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని చెప్పాడు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు సుధీర్ హీరో గానూ చేస్తున్న సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న మొదటి చిత్రం 'సాఫ్ట్వేర్ సుధీర్' దాదాపు చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్ మొదటివారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుడిగాలి సుధీర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పదేళ్ల క్రితం తాను ఫిలిం నగర్ వచ్చినప్పుడు.. బయటి నుంచి ఫిలిం చాంబర్‌ను చూసి మురిసిపోయేవాడిని అని.. ఈరోజు అదే ఫిలిం చాంబర్లో నిలబడి తన సినిమా గురించి మాట్లాడుతుండటం సంతోషంగా ఉందని అన్నాడు. ఈ ఏడాది మార్చి 20వ తేదీ తన జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు. అదే రోజు హీరోగా తన ప్రయాణం మొదలైందన్నాడు.
ఆరోజు ఉదయం 'సాఫ్ట్వేర్ సుధీర్' సినిమా షూటింగ్ ప్రారంభమైందని.. అదే రోజు రాత్రి '3 మంకీస్' షూటింగ్ మొదలైందని చెప్పాడు. కెరీర్లో మొదటి సినిమానే పెద్ద టెక్నీషియన్లతో చేస్తానని అసలు ఊహించలేదన్నాడు.ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు పులిచర్ల రాజశేఖర్ రెడ్డి, నిర్మాత శేఖర్ రాజులకు ధన్యవాదాలు తెలిపాడు. ధన్య బాలకృష్ణన్ లాంటి హీరోయిన్,గౌతం రాజు వంటి టెక్నీషియన్లతో పనిచేయడం తన అదృష్టం అని చెప్పాడు.సినిమా బాగా వచ్చిందని.. ఇటీవలే మలేషియాలో చిత్రీకరించిన పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని చెప్పాడు. డిసెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌గా.. ఎస్ఎస్ పేరు తనకు కలిసొచ్చిందని.. అలాగే 'సాఫ్ట్వేర్ సుధీర్' టైటిల్లోనూ ఎస్ఎస్ ఉండటంతో.. సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని చెప్పాడు. సినిమాలో కామెడీతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయని తెలిపాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.