మా అమ్మను చుట్టాలే తిట్టారు.. పెళ్లి చూపులు దర్శకుడి మనోవేదన..

ఇండస్ట్రీలో ఉన్నపుడు చాలా విమర్శలు తట్టుకోవాల్సి వస్తుంది. అలా తట్టుకున్నపుడే విజయం వస్తుంది. ఒకవేళ అపజయం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉన్నపుడే కదా నిలబడే స్థైర్యం వస్తుంది. ఎందుకంటే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 15, 2019, 8:55 PM IST
మా అమ్మను చుట్టాలే తిట్టారు.. పెళ్లి చూపులు దర్శకుడి మనోవేదన..
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker Dhaassyam)
  • Share this:
ఇండస్ట్రీలో ఉన్నపుడు చాలా విమర్శలు తట్టుకోవాల్సి వస్తుంది. అలా తట్టుకున్నపుడే విజయం వస్తుంది. ఒకవేళ అపజయం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉన్నపుడే కదా నిలబడే స్థైర్యం వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి సినిమాల్లోకి వస్తున్నామంటే కచ్చితంగా చాలా వేళ్లు మన వైపు చూపించడానికి కూడా సిద్ధంగానే ఉంటాయి.. ఇలాంటి అనుభవాలే సినిమా వాళ్లకు చాలా మందికి ఎదురవుతుంటాయి. ఇప్పుడు తరుణ్ భాస్కర్ విషయంలో కూడా ఇదే జరిగింది. హాయిగా డైరెక్షన్ చేసుకోక నీకెందుకురా యాక్టింగ్.. అక్కడ అవకాశాలు లేవు కాబట్టి యాక్టింగ్ వైపు వచ్చావు కదా అంటూ తనను చాలా మంది విమర్శించారని చెబుతున్నాడు తరుణ్.
Tharun Bhascker Interesting comments on his mother and Meeku Matrame Chepta movie pk ఇండస్ట్రీలో ఉన్నపుడు చాలా విమర్శలు తట్టుకోవాల్సి వస్తుంది. అలా తట్టుకున్నపుడే విజయం వస్తుంది. ఒకవేళ అపజయం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉన్నపుడే కదా నిలబడే స్థైర్యం వస్తుంది. ఎందుకంటే.. vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda facebook,vijay devarakonda instagram,vijay devarakonda Tharun Bhascker Dhaassyam,meeku mathrame cheptha movie,meeku mathrame cheptha movie vijay devarakonda,Tharun Bhascker Dhaassyam,Tharun Bhascker Dhaassyam twitter,Tharun Bhascker Dhaassyam meeku mathrame cheptha,Vijay Deverakonda,Anasuya Bharadwaj,tarun bhaskar vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda production,vijay devarakonda tarun bhaskar hero,vijay devarakonda anasuya Bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj vijay devarakonda,jabardasth anchor anasuya bharadwaj tarun bhaskar,jabardasth anchor anasuya bharadwaj movies,tarun bhaskar vani bhojan,telugu cinema,తరుణ్ భాస్కర్,తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ,తరుణ్ భాస్కర్ వాణి భోజన్,తరుణ్ భాస్కర్ అనసూయ భరద్వాజ్,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా,విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్,తెలుగు సినిమా
తరుణ్ భాస్కర్ ఫైల్ ఫోటో


ప్రస్తుతం ఈయన విజయ్ దేరవకొండ నిర్మాతగా మారి చేస్తున్న మీకు మాత్రమే చెప్తాలో హీరోగా నటించాడు. కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. త్వరలోనే విడుదల కానుంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రమోషన్స్‌లో భాగంగా తనకు ఎదురైన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు తరుణ్ భాస్కర్. దర్శకత్వం కాదని నటన వైపు వస్తున్నపుడు తనను తిట్టిన వాళ్లు కూడా ఉన్నారని.. తనకే కాదు అమ్మ విషయంలో కూడా ఇలాగే చేసారని చెప్పాడు తరుణ్.

ఫిదాలో తన అమ్మకు నటించే అవకాశం వచ్చినపుడు.. మొగుడు పోయాడు.. విధవవు నీకెందుకు నటన అంటూ వెక్కిరించారని.. హేళన చేసారని గుర్తు చేసుకున్నాడు తరుణ్ భాస్కర్. తనపై కూడా ఇలాంటి కమెంట్స్ చేస్తున్నా కూడా పట్టించుకోనంటున్నాడు ఈయన. తన భార్య, తల్లికి నచ్చితే మిగిలిన వాళ్లు ఏమనుకున్నా కూడా తనకు అవసరం లేదంటున్నాడు ఈయన. మొత్తానికి మీకు మాత్రమే చెప్తానంటూ హీరో అయిపోయాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో అనసూయ కూడా కీలక పాత్రలో నటించింది.
First published: October 15, 2019, 8:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading