తరుణ్ భాస్కర్ సీన్ రివర్స్.. దర్శకత్వం నుంచి నటన వైపు అడుగులు..
ఓడలు బళ్లు.. బళ్ళు ఓడలు కావడం ఇదే కాబోలు. దర్శకుడిగా వచ్చి హీరో అయిపోయాడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ హీరోగా మూడేళ్ల కింద వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నాడు.

తరుణ్ భాస్కర్ (Source: Twitter)
- News18 Telugu
- Last Updated: September 6, 2019, 7:55 PM IST
ఓడలు బళ్లు.. బళ్ళు ఓడలు కావడం ఇదే కాబోలు. దర్శకుడిగా వచ్చి హీరో అయిపోయాడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ హీరోగా మూడేళ్ల కింద వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో జాతీయ అవార్డు అందుకుని సంచలనం సృష్టించాడు తరుణ్ భాస్కర్. ఆ ఒక్క సినిమాతోనే ఈయన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఆ తర్వాత గతేడాది సురేష్ బాబు నిర్మాతగా కొత్త వాళ్లతో ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో మూడో సినిమాకు ఇంకా ముహూర్తం పెట్టలేదు తరుణ్.

ఈ గ్యాప్లోనే ఇప్పుడు నటుడిగా బిజీ అవుతున్నాడు ఈయన. ఇప్పటికే మహానటి, ఫలక్ నామా దాస్ లాంటి సినిమాల్లో నటించాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు ఏకంగా పూర్తిస్థాయి హీరోగా మారిపోతున్నాడు. హీరో విజయ్ దేవరకొండ తన కింగ్ ఆఫ్ హిల్ బ్యానర్లో కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్తో ఓ సినిమా చేస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా అంటూ వస్తున్న ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ హీరో. ఇప్పుడు విడుదలైన టీజర్ అదిరిపోయింది. నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కేస్తున్నాడు ఈయన.
ఈ చిత్రంలో హీరోగా తరుణ్ భాస్కర్ నటిస్తుంటే.. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక తరుణ్ భాస్కర్ జోడీగా తమిళ బ్యూటీ వాణి భోజన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది మీకు మాత్రమే చెప్తా. ఈ చిత్రంతోనే తొలిసారి విజయ్ దేవరకొండ తొలిసారి పూర్తిస్థాయి నిర్మాతగా మారిపోయాడు. అక్టోబర్లో విడుదల కానుంది ఈ చిత్రం.

తరుణ్ భాస్కర్ వాణి భోజన్

Loading...