Home /News /movies /

THANK YOU MOVIE REVIEW AND RATING AKKINENI NAGA CHAITANYA EMOTIONAL LOVE JOURNEY TA

థాంక్యూ (Thank You)
థాంక్యూ (Thank You)
2.5/5
రిలీజ్ తేదీ:22/7/2022
దర్శకుడు : విక్రమ్ కే కుమార్ (Vikram K Kumar)
సంగీతం : థమన్ (SS Thaman)
నటీనటులు : అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తదితరులు..
సినిమా శైలి : లవ్, రొమాన్స్ (Love Story and Romance)
సినిమా నిడివి : 2 Hr 10 M

Thank You Movie Review : నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ రివ్యూ.. ఓ కుర్రాడి ఎమోషనల్ లవ్ జర్నీ..

నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ రివ్యూ  (Photo Twitter)

నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ రివ్యూ (Photo Twitter)

Thank You Movie Review : నాగ చైతన్య ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన తాత ఏఎన్నార్, నాన్న నాగార్జున సహా ఫ్యామిలీ మెంబర్స్‌తో ‘మనం’ వంటి మెమరబుల్ మూవీ తెరకెక్కించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన మూవీ ‘థాంక్యూ’. మరి ఈ మూవీతో చైతూకు విక్రమ్ కుమార్ మెమరబుల్ హిట్ అందించాడా ? లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
    రివ్యూ : థాంక్యూ   (Thank You)
    నటీనటులు : అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తదితరులు..
    ఎడిటర్: నవీన్ నూలి
    సినిమాటోగ్రఫీ: పిసి శ్రీరామ్
    సంగీతం: థమన్
    నిర్మాత : దిల్ రాజు                                                                                                                                  దర్శకత్వం : విక్రమ్ కే కుమార్                                                                                                             విడుదల తేది : 22/7/2022

    అక్కినేని  నాగ చైతన్య ప్రస్తుతం ఈ యేడాది తన తండ్రితో కలిసి నటించిన ‘బంగార్రాజు’తో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇపుడు ఊపులో  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ‘థాంక్యూ’ మూవీ చేసాడు. ఈ నేపథ్యంలో తన తాత ఏఎన్నార్, నాన్న నాగార్జున సహా ఫ్యామిలీ మెంబర్స్‌తో ‘మనం’ వంటి మెమరబుల్ మూవీ తెరకెక్కించిన విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ‘థాంక్యూ’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా ? లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం. .. మరి ఈ మూవీతో చైతూకు విక్రమ్ కుమార్ మెమరబుల్ హిట్ అందించాడా ? లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..

    కథ విషయానికొస్తే..

    నారాణయపురంలో పెరిగిన అభిరామ్ (అక్కినేని నాగ చైతన్య) కాలేజీ చదువుల తర్వాత ఒంటరిగా అమెరికా వెళతాడు. అక్కడ తన క్రియేటివ్ ఆలోచనలతో ‘వైద్య’ అనే యాప్ తయారు చేస్తాడు. అది వరల్డ్ సక్సెస్ ఫుల్ యాప్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో తన ఎదుగుదలలో అతనికి అహంకారం తలకెక్కుతోంది. తన కెరీర్ గ్రోత్‌లో తనకు సహకరించిన సహోద్యోగులను తన వాళ్లను దూరం చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో అభిలో పశ్చాతాపం మొదలవుతోంది. ఈ క్రమంలో తన ఎదుగులలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపడానికి యూఎస్ నుంచి భారత దేశానికి వస్తాడు. ఈ నేపథ్యంలో అతని జీవితంలో జరిగిన సంఘటనల వివిధ దశల్లో జరిగిన సంఘటనల సమాహారమే ‘థాంక్యూ’ మూవీ స్టోరీ.

    కథనం..

    దర్శకుడు విక్రమ్ కుమార్.. తన తోటి డైరెక్టర్ కమ్ రచయత బివియస్ రవి ఇచ్చిన కథను తనదైన టేకింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కథ చూస్తుంటే.. మనకు రవితేజ.. ‘నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమరీస్’తో పాటు మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలు కూడా గుర్తుకు వస్తాయి. ఫస్టాఫ్‌లో విక్రమ్ కుమార్ టేకింగ్ బాగుంది. ఎక్కడ కథను లాగ్ కాకుండా చక చకా ముందుకు తీసుకెళ్లాడు. నాగ చైతన్యలోని నటుడిని ఈ సినిమాతో వెలికి తీసాడనే చెప్పాలి. సినిమా చూస్తుంటే... ఎపుడు పాత సినిమాలను జ్ఞాపకానికి వస్తాయి. చైతూ లవ్ స్టోరీని ఇంకాస్త బెటర్‌గా చూపించి ఉంటే బాగుండేది. ఎమోషనల్ సీన్స్‌ను ఇంకాస్త బెటర్‌గా చూపించి ఉంటే బాగుండేది.

    ఇందులో చైతూను మూడు దశల్లో చూపించిన విధానం బాగుంది.  ఇక ఆడియన్స్ కోరుకునే ఎంటర్టేన్మెంట్ మిస్ అయింది. ముఖ్యంగా క్లాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఇక హీరో అభి.. మాళవిక నాయర్, ఆమె తండ్రిని కలిపే సీన్ కన్విన్స్‌గా ఉండదు.  ఓవరాల్‌గా అక్కడక్కడ కన్ఫ్యూజన్ ఉన్న ఈ సినిమాలో  బీ, సీ సెంటర్ ఆడియన్స్ కోరుకునే అంశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్. ఇక ఈ సినిమా చూస్తుంటే.. నెక్ట్స్ ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశం వస్తుందో ఊహించుకోవచ్చు. సెకాండాఫ్‌లో కాలేజీ బ్యాక్ డ్రాస్ రెగ్యులర్‌గానే శివ టైపు కాలేజ్ గ్యాంగ్ గొడవలను చూపించారు. ఫీల్ గుడ్ మూవీగా అనిపించినా.. ఎక్కడో ఏదో తెలియని లోపం వెంటాడుతోంది. మొత్తంగా ఈ సినిమా థియేటర్స్‌ కంటే ఓటీటీలో ఎక్కువగా హిట్టయ్యే అవకాశాలున్నాయి.  ఇక పీసీ శ్రీరామ్ తన కెమెరాతో ఈ సినిమాను అద్భుతంగా చూపించాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ ఎక్కడ లాగ్ లేకుండా తన పని చకచక కానీచ్చేసాడు.

    నటీనటుల విషయానికొస్తే..

    నాగ చైతన్య ఈ సినిమాలో మూడు వేరియషన్స్ చూపించాడు. ముఖ్యంగా వైద్య యాప్ కంపెనీ ఓనర్‌గా సెల్ఫీష్ వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. ఇప్పటి వరకు సాఫ్ట్‌గా.. యాక్షన్ హీరోగా చూసిన చైతూను ఇందులో నెగిటివ్ యాంగిల్‌తో చైతూలోని నటుడి బయటకు వచ్చాడు. యంగ్‌గా పాత్రలో  చైతూ గెటప్ అదిరిపోయింది. ఆ తర్వాత కాలేజ్ డేస్ మాములుగా ఉంది. ఇక మూడు దశల్లో తన నటనతో మెప్పించాడు. ఇక హీరోయిన్‌గా నటించిన రాశీ ఖన్నా.. అభి తనను పట్టించుకోవడం లేదు. పూర్తి సెల్ఫీష్ గా మారిపోయాడనుకొని తపన పడే పాత్రలో చాలా బాగా నటించింది. ఇక మాళవిక ..  నాగ చైతన్య లవర్ పాత్రలో బాగుంది. వీళ్లిద్దరి మధ్య సీన్స్ బాగున్నాయి. అవికా గోర్ తన పాత్రకు న్యాయం చేసింది. ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ సహా మిగతా పాత్రల్లో నటించిన నటీనటులకు పెద్దగా యాక్టింగ్‌కు స్కోప్ లేదు.

    ప్లస్ పాయంట్స్ 

    నాగ చైతన్య నటన

    పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్

    తమన్ మ్యూజిక్

    మైనస్ పాయంట్స్ 

    సాదాసీదా కథ

    బోరింగ్‌గా సాగే కథనం

    చివరి మాట : ఓ కుర్రాడి సాదాసీదా ఎమోషనల్ లవ్ స్టోరీ..

    రేటింగ్ : 2.5/5
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    రేటింగ్

    కథ:
    2/5
    స్క్రీన్ ప్లే:
    2.5/5
    దర్శకత్వం:
    2.5/5
    సంగీతం:
    3/5

    Tags: Naga Chaitanya Akkineni, Raashi Khanna, Thank You Movie, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు