Thaman Trolling By Netizens: ట్యూన్ కాపీ చేసిన తమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

తమన్ మ్యూజిక్ డైరెక్టర్ (Twitter/Photo)

Thaman - Krack Movie: క్రాక్‌ సినిమాలో ఓ ట్యూన్‌ను తమన్‌ కాపీ కొట్టాడంటూ నెటిజన్స్‌ తమన్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతకీ తమన్‌ ఏ సాంగ్‌ కాపీ కొట్టాడో తెలుసా?

  • Share this:
    ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరంటే ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తాయి. అందులో ఒకరు తమన్‌ కాగా.. మరొకరు దేవిశ్రీ ప్రసాద్‌. ఈ ఇద్దరిలో తమన్‌ ప్రస్తుతం టాప్‌ రేంజ్‌లో ఉన్నాడు. పవన్‌కల్యాణ్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌ సహా స్టార్‌ హీరోలందరికీ ఈయనే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్‌ సంగీత సారథ్యం వహించిన కొన్ని సినిమాల్లో రవితేజ క్రాక్‌ ఒకటి. ఈ సినిమాలో ఇప్పటి వరకు రెండు పాటలు విడుదలయ్యాయి. అందులో రీసెంట్‌గా విడుదలైన బీచ్‌ సాంగ్‌.. తమన్‌కు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. ఈ సాంగ్‌ మధ్యలో తమన్‌ వాడిన ఓ బీట్‌ లాటిన్‌ చిత్రం 'సెల్వా ఎల్ నియాన్' నుండి కాపీ కొట్టాడంటూ నెటిజన్స్‌ తమన్‌ను ట్రోలింగ్‌ చేయడం మొదలుపెట్టారు. రెండు ట్యూన్స్‌ను కంపేర్‌ చేస్తూ మీమ్స్‌, జోక్స్‌ వేస్తూ తమన్‌ను ట్రోల్‌ చేస్తున్నారందరూ. ఒకరైతే థాంక్స్‌ అన్నా.. కేవలం 47 మాత్రం ఉన్న వ్యూస్‌ నీ వల్ల రాత్రికి రాత్రే పదిహేడు వేలయ్యాయి. ఎవరు గుర్తపట్టారనుకున్నారేమో దొరికిపోయారని మరికొందరు కామెంట్‌ చేశారు. సాంగ్‌ లాటిన్‌ అయితే క్రెడిట్‌ తమన్‌కి దక్కింది అంటూ మరొకరు అన్నారు. కింగ్‌ సినిమాలో నాగార్జున, బ్రహ్మానందం కామెడీ సీన్‌ను మరికొందరు ట్రోలింగ్‌లో వాడుతున్నారు. ఈ ఏడాది తమన్‌ సంగీతం అందించిన వి సినిమాలోనూ తమన్‌ కాపీ వివాదంలో చిక్కుకున్నారు.




    కెరీర్ ప్రారంభంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న తమన్, వరుస అవకాశాలను అందుకున్నాడు. చాలా స్పీడుగా సినిమాలు చేసే క్రమంలోనే మరేమో కానీ.. కాపీ ట్యూన్స్‌ తీసుకోవడం, గందరగోళమైన సంగీతాన్ని అందించడం వంటి కారణాలతో నెటిజన్స్‌ తమన్‌ను టార్గెట్‌ చేస్తూ వచ్చారు. టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో తమన్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకోవడానికి కూడా సందేహించారు. అలాంటి సమయంలో అరవింద సమేత, వరుణ్‌ తేజ్ తొలి ప్రేమ చిత్రాలు మ్యూజికల్‌గా తమన్‌లోని టాలెంట్‌ను మరో కోణంలో ఎలివేట్‌ చేశాయి. దీంతో దర్శక నిర్మాతలు తమ సినిమాకు తమన్‌ సంగీతం కావాలని పట్టు బట్టారు. ఈ క్రమంలో అగ్ర కథానాయకుల చిత్రాలకు తమన్‌ వరుసగా బుక్‌ అయ్యాడు. అప్పటి వరకు ఓ రేంజ్‌లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్‌ స్పీడు తగ్గింది.
    Published by:Anil
    First published: