Home /News /movies /

THALAPATHY VIJAY TO FILM JAWAN CAMEO WITH SRK IN CHENNAI SB

Jawan: షారుక్ ఖాన్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

షారుఖ్ ఖాన్ (Twitter/Photo)

షారుఖ్ ఖాన్ (Twitter/Photo)

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో జవాన్‌ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే విడుదలైన టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.

    షారుఖ్  ఖాన్.. తమిళ అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్న అట్లీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి  ముందుగా ‘లయన్’ టైటిల్‌ అనుకున్నారు. చివరగా ఈ సినిమాకు జవాన్ టైటిల్ ఖరారు చేస్తూ ఓ టీజర్‌ను విడుదల చేశారు. తమిళ దర్శకుడు అట్లీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి.. మొదటి సినిమా 'రాజారాణి'కి ఆయన్నే నిర్మాతగా పెట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌ను కొట్టాడు. ఆ తరువాత వరుసగా విజయ్‌తో 'పోలీసోడు', 'అదిరింది', 'విజిల్' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో కోలీవుడ్‌ అగ్ర దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

    అట్లీ నుంచి సినిమా వచ్చి మూడేళ్ళయింది. ఈ క్రమంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో జవాన్‌ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే విడుదలైన టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ టీజర్‌లో ముఖానికి గాయాలతో బట్ట చుట్టుకొని ఉన్న షారుఖ్ ఖాన్ లుక్ ఇంటెన్సివ్‌‌గా కనిపించింది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ప్యాన్ ఇండియా లెవల్లో వచ్చే యేడాది 2 జూన్ 2023లో  రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.



    ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కనిపించనున్నట్లు సమాచారం.ఈ మధ్య కాలంలో తమిళ్ స్టార్ హీరోలు.. గెస్ట్ రోల్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవలే విక్రమ్ సినిమాలో స్టార్ హీరో గెస్ట్ రోల్‌లో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా షారుక్ సినిమాలో కూడా ఓ హీరో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం జవాన్ సినిమా షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో గెస్ట్ రోల్ కోసం అట్లీ స్టార్ హీరోను రంగంలో దింపుతున్నాడు. ఇంతకీ ఆ హీర ఎవరంటేజజజ తమిళ స్టార్ హీరో విజయ్. జవాన్ సినిమాలో విజయ్ పాత్ర 5 నిమిషాలు ఉండనుందని టాక్.

    అంతేకాకుండా కథను మలుపు తిప్పే పాత్ర విజయ్‌దని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో షారుఖ్ తండ్రి, కొడుకుగా డ్యూయల్ రోల్‌లో నటించనున్నాడు. నయనతార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్‌గా నటించనుంది. బాలీవుడ్ భామ సాన్య మల్హోత్రా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుఖ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 2న విడుదల కానుంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Jawan, Shah Rukh Khan, Tamil actor vijay, Thalapathy Vijay

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు