సినీ నటుడు, తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు లోకేష్ కనకరాజ్. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అది అలా ఉంటే ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇటు సోషల్ మీడియాలో.. అటు తమిళ నాట హల్ చల్ చేస్తోంది. విజయ్ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నాడట.. ఈ వార్త తమిళనాడు రాజకీయాలతోపాటు, కోలీవుడ్‌లోనూ ఇప్పుడు ఎడతెగని చర్చగా మారింది. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయబోతున్నాడంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అయితే ఇతర పార్టీల్లో చేరకుండా.. సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నాడట. అందులో భాగంగా విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఇప్పటికే రంగంలోకి దిగారని, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారని తాజా సమాచారం. ఇక పార్టీ కావాల్సిన న్యాయ సలహాల కోసం ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాదితో టచ్‌లో ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా విజయ్ పొలిటిటకల్ ఎంట్రీపై కానీ.. లేదా సొంత పార్టీ విషయంపై.. విజయ్ నుంచి కానీ, ఆయన తండ్రి చంద్రశేఖర్ నుంచి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
అది అలా ఉంటే.. విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మాస్టర్ అనే సినిమా చేస్తున్నాడు. విడుదలకు రెడీ అయినా ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఖైదీతో అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా.. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా చేసింది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ ప్రకటన విడదలకానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tamil Film News, Vijay