Suresh RachamallaSuresh Rachamalla
|
news18-telugu
Updated: November 26, 2019, 6:14 PM IST
Facebook
Bigil: తమిళ నటుడు విజయ్, అట్లీ కుమార్ దర్శకత్వంలో 'బిగిల్' అనే సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. దీన్నే తెలుగులో 'విజిల్'గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో ‘తేరి’ ‘మెర్సల్’ రెండు సినిమాలు రాగా.. ఇప్పుడు మూడోసారి మరో సంచలనానికి తెరలేపారు. అది అలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అట్లీ తన కథను కాపీ చేశారని తెలుగు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నంది చిన్ని కుమార్ ఆరోపించారు. తాను స్పోర్ట్ నేపథ్యంలో రాసుకున్న కథలోని ఆత్మతో ‘విజిల్’ సినిమా తీశారని అంటున్నారు. తాను ‘స్లమ్ సాకర్’ కాన్సెప్ట్‌తో రాసుకున్న ఓ కథను తమిళ డైరెక్టర్ అట్లీ ‘విజిల్’ అంటూ సినిమా తీశారని ఆరోపించారు. అంతేకాదు ఈ సినిమాపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నంది చిన్ని కుమార్.. తెలంగాణ సినిమా రచయితల సంఘాన్ని కోరారు. అందులో భాగంగా ఓ పిటిషన్ కూడా ఫైల్ చేశారు. అయితే.. ‘విజిల్’ కథ పూర్తిగా తాను రాసుకున్న కథలా లేదని, కానీ నా సినిమాలోని ఆత్మను తీసుకున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రెండు కథలను పరిశీలించి, త్వరలోనే ఈ వివాదంపై తెలంగాణ సినిమా రచయితల సంఘం చర్యలు తీసుకోనుంది. మరో వైపు అటు తమిళ నాడులో కూడా ‘విజిల్’ సినిమాపై దర్శకుడు కేపీ సెల్వ కేసు పెట్టారు. తన కథను కాపీ కొట్టారంటూ మద్రాసు హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. దీంతో అక్టోబరు 25న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా వివాదంలో పడింది. విజిల్లో విజయ్ సరసన నయనతార నటించగా.. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
Published by:
Suresh Rachamalla
First published:
October 19, 2019, 8:10 AM IST