విజయ్ మళ్లీ ఆ దర్శకుడితోనే.. కత్తి, తుపాకి పట్టుకుని..

Murugadoss: మురుగ‌దాస్‌కు కష్టకాలం నడుస్తుంది. కొన్నేళ్లుగా ఈయన నుంచి స్థాయికి తగ్గ సినిమాలు రావడం లేదనే కంప్లైంట్ ఉంది. మహేష్ బాబుతో చేసిన స్పైడ‌ర్.. మొన్నొచ్చిన దర్బార్ ఫ్లాప్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 18, 2020, 2:48 PM IST
విజయ్ మళ్లీ ఆ దర్శకుడితోనే.. కత్తి, తుపాకి పట్టుకుని..
దాంతో తెలుగులోనూ విజయ్ మార్కెట్ పెరిగిపోయిందిప్పుడు. తాజాగా ఈయన నటించిన మాస్టర్ సినిమా లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. నిజానికి ఎప్రిల్ 14నే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ లాక్‌డౌన్, కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ రాలేదు.
  • Share this:
ఎలాంటి ద‌ర్శ‌కుడైనా ఒక్క ఫ్లాప్ ఇస్తే చాలు.. అత‌డి ముందు విజ‌యాల‌న్నీ మ‌రిచిపోయే ఇండ‌స్ట్రీ ఇది. అది వాళ్ల త‌ప్పు కాదు.. ఇండ‌స్ట్రీ పోక‌డ అంతే మ‌రి. ఇక్క‌డ విజ‌యాల‌కే కానీ ప‌రాజ‌యాల‌కు చోటుండ‌దు. అందుకే అగ్ర ద‌ర్శ‌కుల‌కు కూడా అప్పుడ‌ప్పుడూ ఈ తిప్ప‌లు త‌ప్ప‌వు. ఇప్పుడు మురుగ‌దాస్‌కు కూడా ఇదే ప‌రిస్థితి వ‌చ్చింది. గత కొన్నేళ్లుగా ఈయన నుంచి స్థాయికి తగ్గ సినిమాలు రావడం లేదనే కంప్లైంట్ ఉంది. మహేష్ బాబుతో చేసిన స్పైడ‌ర్ డిజాస్టర్.. విజయ్‌తో చేసిన సర్కార్ హిట్ అయినా కూడా నాసీరకం కథే.. ఇక మొన్నొచ్చిన దర్బార్ కూడా ఫ్లాప్ కావడంతో మురుగదాస్ రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది.

దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)
దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)


స్పైడర్ ముందు వరకు కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా.. ఎందుకు చేసాడ్రా బాబూ ఈ సినిమా అని విమ‌ర్శించేంత చెత్త సినిమా అయితే చేయ‌లేదు మురుగ‌దాస్. కానీ స్పైడ‌ర్‌తో ఆ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టించి.. ఓ నాసీర‌కం సినిమా తీసాడంటూ మురుగ‌దాస్.. మ‌హేశ్ పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దర్బార్ కూడా రజినీ అభిమానులను సంతృప్తి పరిచినా బయ్యర్లను ముంచేసింది. దాంతో ఇప్పుడు ఆ విమ‌ర్శ‌ల‌ను తొల‌గించుకునే ప‌నిలో ప‌డ్డాడు ఈ ద‌ర్శ‌కుడు.

విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో మరో సినిమా
విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో మరో సినిమా


అందుకే తనకు కలిసొచ్చిన హీరోనే మరోసారి నమ్ముకుంటున్నాడు ఈ దర్శకుడు. విజయ్ హీరోగా నాలుగో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు మురుగదాస్. ఫ్లాప్ వచ్చిన ప్రతీసారి విజయ్‌ను వెతుక్కుంటూ వెళ్లడం అలవాటు చేసుకున్నాడు మురుగదాస్. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో వచ్చిన తుపాకి, క‌త్తి, సర్కార్ విజయం సాధించాయి.

విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో మరో సినిమా
విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో మరో సినిమా


ఇప్పుడు మరోసారి అదే చేయాలనుకుంటున్నాడు ఈయన. చిత్రం ఏంటంటే క‌త్తి.. తుపాకి.. సర్కార్‌కి ముందు కూడా మురుగ‌దాస్‌కు ఫ్లాపులు ఉన్నాయి. అప్పుడు కూడా విజ‌య్‌తోనే హిట్ కొట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ చేయాల‌ని చూస్తున్నాడు. మొత్తానికి ఈ సారి విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: March 18, 2020, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading