THALAPATHY VIJAY MEETS TAMIL NADU CM PALANISWAMI FOR MASTER MOVIE COLLECTIONS AND THEATRES PK
Vijay Master: విజయ్ ‘మాస్టర్’ ప్లాన్.. తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం..
విజయ్ మాస్టర్ (Vijay Master)
Vijay Master: తెలుగులో పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఇమేజ్ ఉందో.. అంతకంటే కాస్త ఎక్కువే విజయ్‌కు తమిళనాట ఉంది. ఈయన సినిమా వస్తుందంటే చాలు రచ్చ రచ్చగా ఉంటుంది అక్కడ.
తెలుగులో పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఇమేజ్ ఉందో.. అంతకంటే కాస్త ఎక్కువే విజయ్‌కు తమిళనాట ఉంది. ఈయన సినిమా వస్తుందంటే చాలు రచ్చ రచ్చగా ఉంటుంది అక్కడ. థియేటర్స్ ముందు క్యూ కట్టడం.. బాక్సులను ఊరేగించుకుంటూ తీసుకురావడం ఇప్పటికీ జరుగుతుంటుంది. అది చూసి వారెవ్వా అంటుంటారు అంతా. దానికితోడు ఈయన రాజకీయాల్లోకి వస్తాడని చాలా రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉంటాయి. దీనిపై ఎప్పటికప్పుడు నేను రాను అంటూ విజయ్ చెప్తున్నా కూడా కచ్చితంగా వస్తాడనే నమ్మకం అయితే అభిమానుల్లో ఉంది. పైగా రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రాను అని చెప్పడంతో విజయ్ కచ్చితంగా వస్తాడనే నమ్మకాలు మరింత పెరిగిపోయాయి. దానికితోడు ఇప్పుడు జరిగే కొన్ని చిత్రాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. తాజాగా విజయ్ వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిని కలిసాడు. ఆయన కలవడంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి. రాజకీయాల్లోకి రాను అంటూనే వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం వెనక ఏంటి మతలబు అంటూ అంతా ఆలోచనలో పడిపోయారు. అయితే ఈయన నటించిన మాస్టర్ సినిమా జనవరి 13న విడుదల కానుంది.
విజయ్ మాస్టర్ సినిమాలో సాంగ్ (master movie)
తెలుగు, తమిళంలో ఈ సినిమా ఒకేసారి విడుదలవుతుంది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా తగ్గుమఖం పట్టడంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకుల సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో విజయ్ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. జనవరి 13న ఈ సినిమా విడుదలవుతుంది. కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటించేలా సినిమా థియేటర్లలో 50 శాతం సీటింగు మాత్రమే నిండేలా గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విజయ్ మాస్టర్ పోస్టర్ (Thalapathy Vijay)
కానీ ఇప్పుడు తగ్గుతున్నాయనే కారణంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో సీటింగ్ సామర్థ్యాన్ని 10 0శాతానికి పెంచుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పైగా విజయ్ కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడంపై లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ఈయన పార్టీ పెడుతున్నాడనే వార్తలొస్తున్న నేపథ్యంలో విజయ్ సినిమాకు కలిసొచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారుతుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా తన అజ్ఞాతవాసి సినిమా విషయంలో అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ను కలిసి టికెట్ రేట్స్ పెంచేలా చేసుకున్నాడు. ఇప్పుడు విజయ్ కూడా ఇదే చేసాడు.