హోమ్ /వార్తలు /సినిమా /

Vaathi Coming Song: వాతి కమింగ్ @ 150 మిలియన్.. యూ ట్యూబ్‌లో ‘మాస్టర్’ సాంగ్ రికార్డ్స్..

Vaathi Coming Song: వాతి కమింగ్ @ 150 మిలియన్.. యూ ట్యూబ్‌లో ‘మాస్టర్’ సాంగ్ రికార్డ్స్..

అందుకే టైటిల్స్ కూడా అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పెడుతున్నారు. ఒక్కో భాషకు ఒక్కో టైటిల్ కాకుండా అందరికీ ఒకటేలా యూనివర్సల్ టైటిల్స్ కోసం చూస్తున్నాడు విజయ్. తాజాగా బీస్ట్ అంటూ అలాంటి టైటిల్‌తోనే వచ్చాడు. అలా కొన్నేళ్లుగా విజయ్ కామన్ టైటిల్స్ ఏంటో చూద్దాం..

అందుకే టైటిల్స్ కూడా అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పెడుతున్నారు. ఒక్కో భాషకు ఒక్కో టైటిల్ కాకుండా అందరికీ ఒకటేలా యూనివర్సల్ టైటిల్స్ కోసం చూస్తున్నాడు విజయ్. తాజాగా బీస్ట్ అంటూ అలాంటి టైటిల్‌తోనే వచ్చాడు. అలా కొన్నేళ్లుగా విజయ్ కామన్ టైటిల్స్ ఏంటో చూద్దాం..

Vaathi Coming Song: ఏడాదిన్నర కాలంగా ఓ పాట ఇండియాను ఊపేసింది. అదే వాతి కమింగ్(Vathi Coming). మాస్టర్(Master) సినిమాలోని ఈ పాట సృష్టించిన సంచలనం గురించి మాటల్లో చెప్పడానికి సరిపోదు. ఎందుకంటే అలాంటి అరాచకం చేసింది ఇది. తాజాగా మరో రికార్డు అందుకుంది ఈ పాట.

ఇంకా చదవండి ...

ఏడాదిన్నర కాలంగా ఓ పాట ఇండియాను ఊపేసింది. టిక్ టాక్ బ్యాన్ అయిపోయి బతికిపోయింది కానీ లేదంటే అందులో మరింత రచ్చ చేసేది ఆ పాట. అప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా ఆ పాటకు డాన్సులేసారు. అదే వాతి కమింగ్. మాస్టర్ సినిమాలోని ఈ పాట సృష్టించిన సంచలనం గురించి మాటల్లో చెప్పడానికి సరిపోదు. ఎందుకంటే అలాంటి అరాచకం చేసింది ఇది. అనిరుధ్ సంగీతం అందించిన వాతి కమింగ్ పాటలో విజయ్ డాన్సులు సూపర్ ఫేమస్ అయ్యాయి. ఎంతగా అంటే.. టిక్ టాక్ ఉన్నపుడు అందులో ఈ ఒక్క పాటే రోజూ కనిపించేది. ఇప్పటికే ఈ పాట 150 మిలియన్స్ వ్యూస్ సాధించింది. విజయ్, మాళవిక మోహనన్ జంటగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ప్యాండమిక్ తర్వాత తొలి 100 కోట్ల సినిమాగా నిలిచింది మాస్టర్. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా విజయంలో పాటలకు కూడా ప్రధాన పాత్ర ఉంది. తన మ్యూజిక్‌తోనే మ్యాజిక్ చేసారు అనిరుధ్ రవిచంద్ర.

ముఖ్యంగా వాతి కమింగ్ అయితే సంచలనాలు రేపింది. ఇప్పటికీ ఈ పాటకు అంతే ఆదరణ లభిస్తుంది. జనవరి 27న విడుదలైన ఈ పాట రచ్చ చేస్తూనే ఉంది. అప్ లోడ్ చేసిన కేవలం 30 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ అందుకుంది వాతి కమింగ్ పాట. ఈ మధ్యే 150 మిలియన్స్ వ్యూస్ కూడా క్రాస్ చేసింది. తాజాగా మరో రికార్డు కూడా అందుకుంది ఈ పాట.

' isDesktop="true" id="857542" youtubeid="fRD_3vJagxk" category="movies">

వాతి కమింగ్ పాటకు 2 మిలియన్ లైకులు వచ్చాయి. సాధారణంగా 1 మిలియన్ లైకులు వస్తేనే అబ్బో అనుకుంటారు. అలాంటిది ఏకంగా ఈ పాటకు 2 మిలియన్ వచ్చాయి. దాంతో విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికీ వాతి కమింగ్ పాటకు ఆదరణ తగ్గడం లేదు. రోజుకు కనీసం 2 లక్షలకు పైగానే ఈ పాటకు వ్యూస్ వస్తున్నాయి. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే చాలా త్వరగానే 200 మిలియన్స్ క్లబ్బులో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

First published:

Tags: Telugu Cinema, Tollywood, Vijay

ఉత్తమ కథలు