Thalapathy Master: ‘మాస్టర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. 200 కోట్లు దాటించేసిన విజయ్..

విజయ్ మాస్టర్ (Vijay Master)

Thalapathy Master: రజినీకాంత్ తర్వాత తమిళనాట అంత ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటే రజినీ కంటే ముందున్నాడు ఈయన. ప్రస్తుతం తమిళనాట నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్.

  • Share this:
రజినీకాంత్ తర్వాత తమిళనాట అంత ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటే రజినీ కంటే ముందున్నాడు ఈయన. ప్రస్తుతం తమిళనాట నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్. ఈయన తెలుగులో కూడా సత్తా చూపిస్తున్నాడు ఇప్పుడు. తాజాగా ఈయన నటించిన మాస్టర్ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఈ మధ్యే సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది మాస్టర్. ఈ చిత్రం బిజినెస్‌పై ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వాడివేడి చర్చ జరుగుతుంది. సినిమా మేకింగ్ కాస్ట్ చాలా తక్కువగానే అయింది. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేసాడు. రెమ్యునరేషన్ లేకుండా చూసుకుంటే సినిమాకు కేవలం 30 కోట్ల లోపే బడ్జెట్ అయ్యుంటుందని తెలుస్తుంది. అయితే విజయ్ పారితోషికమే దాదాపు 50 కోట్లకు పైగా ఉంది. మరోవైపు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన విజయ్‌సేతుపతి కూడా 10 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. మిగిలిన వాళ్ల రెమ్యునరేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి. అలా ఈ సినిమాకు దాదాపు 130 కోట్ల వరకు ఖర్చు అయింది.
vijay master,vijay master movie release date,vijay master movie pre release business,vijay master movie review,vijay master vijay sethupathi,vijay master pre release business details,lokesh kanakaraj vijay master,విజయ్ మాస్టర్,విజయ్ మాస్టర్ ప్రీ రిలీజ్ బిజినెస్
విజయ్ మాస్టర్ (Vijay Master)

బిజినెస్‌ కూడా అదే స్థాయిలో జరిగింది. తమిళనాడు థియేట్రికల్‌ రైట్స్‌ 70 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 9 కోట్లకు సొంతం చేసుకున్నారు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్. కేరళలో విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ ప్రకారం అక్కడ 7 కోట్లు బిజినెస్ చేసింది మాస్టర్. అలాగే ఓవర్సీస్ 30 కోట్లకు పైగానే అమ్ముడైంది. నార్త్ ఇండియన్ శాటిలైట్‌ రైట్స్‌, డిజిటల్‌ హక్కులు కలిపి 25 కోట్లు, తమిళ శాటిలైట్‌ హక్కులు 30 కోట్లు, ఓటీటీ రైట్స్‌ 20 కోట్లకు అమ్ముడయ్యాయి.
విజయ్ మాస్టర్ పోస్టర్ (Thalapathy Vijay)
విజయ్ మాస్టర్ పోస్టర్ (Thalapathy Vijay)

ఆడియో వగైరా కలిపి మరో 5 కోట్ల వరకు వచ్చాయి. ఎలా చూసుకున్నా కూడా మాస్టర్ ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లకు పైగానే జరిగింది. ఈ చిత్రం కరోనా సమయంలో కూడా ఒక్క తమిళనాడులోనే ఏకంగా 700 థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. కేరళలో 200, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో కలుపుకుని 400 థియేటర్లు, కర్నాటకలో 100, నార్త్‌ ఇండియాలో 1000 థియేటర్స్‌లో విడుదలవుతుంది మాస్టర్.
Published by:Praveen Kumar Vadla
First published: