మాస్టర్ లిరికల్ సాంగ్ అదుర్స్.. విజయ్ పిచ్చెక్కించాడుగా..

Master Kutty Story: దళపతి విజయ్ సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాల కోసం బాగానే వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు కూడా ఈయన నటిస్తున్న మాస్టర్ సినిమాపై..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 14, 2020, 7:29 PM IST
మాస్టర్ లిరికల్ సాంగ్ అదుర్స్.. విజయ్ పిచ్చెక్కించాడుగా..
విజయ్ మాస్టర్ సినిమాలో సాంగ్ (master movie)
  • Share this:
దళపతి విజయ్ సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాల కోసం బాగానే వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు కూడా ఈయన నటిస్తున్న మాస్టర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బిగిల్ సినిమా తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దానికితోడు ఈ మధ్య ఐటి దాడులు.. రాజకీయాలు అంటూ విజయ్ పేరు ఎక్కువగా వార్తల్లో ఉంది. దాంతో పాటు పొలిటికల్ పార్టీలకు కూడా విజయ్ తనదైన శైలిలో వార్నింగులు ఇస్తున్నాడు. అన్నింటికి మించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు విజయ్. ఈయన సినిమా వచ్చిందంటే హిట్ అనే మాటే తప్ప మరో మాట వినిపించడం లేదు.

ఇలాంటి సమయంలో వస్తున్న మాస్టర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటను విజయ్ పాడాడు. వై దిస్ కొలెవరీ తరహాలోనే ఎక్కువగా ఇంగ్లీష్ పదాలున్న ఈ పాటను విజయ్ అద్భుతంగా పాడాడు. యూ ట్యూబ్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్. కుట్టి స్టోరీ అంటూ సాగే ఈ పాటలో మంచి లిరిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా లైఫ్ చాలా చిన్నది.. ఆనందంగా ఉండు అంటూ ఈ పాటలో చెప్పాడు విజయ్. ఫ్యాన్స్‌‌తో పాటు అందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యే క్యాచీ ట్యూన్ ఇచ్చాడు అనిరుధ్. సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు