టాక్ ఎలా వచ్చింది కాదు కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అనేది ముఖ్యం అంటున్నాడు మాస్టర్. విజయ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం జనవరి 13న విడుదలైంది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే దాదాపు 2900 థియేటర్స్‌లో విడుదలైంది మాస్టర్. ప్యాండమిక్ తర్వాత ఇండియాలో అత్యధిక థియేటర్లలో విడుదలైన తొలి భారతీయ సినిమా ఇదే. ఇదిలా ఉంటే మాస్టర్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టిస్తున్నాడు. ఈ చిత్రం తమిళనాట రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పటి వరకు 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక తెలుగులోనూ సత్తా చూపిస్తున్నాడు మాస్టర్. గతంలో విజయ్ సినిమాలకు 5 కోట్ల షేర్ వస్తేనే అబ్బో అనుకునే వాళ్లు కానీ ఇప్పుడు మాస్టర్ 50 శాతం ఆక్యుపెన్సీతోనే అద్భుతాలు చేస్తుంది. సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా రోజుకు కనీసం కోటిన్నర షేర్ వసూలు చేస్తూ లాభాల బాటలో దూసుకుపోతుంది. తెలుగులో 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మాస్టర్.. 4 రోజుల్లో 10.37 కోట్ల షేర్ వసూలు చేసి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది. ఏపీ, తెలంగాణలో 4 రోజుల కలెక్షన్స్ వివరాలు..
ఏపీ తెలంగాణలో 4వ రోజు ‘మాస్టర్’ వసూలు చేసిన మొత్తం..
నైజాం – 30 లక్షలు
సీడెడ్ – 33 లక్షలు
ఉత్తరాంధ్ర – 29 లక్షలు
ఈస్ట్ – 13 లక్షలు
వెస్ట్ – 12 లక్షలు
కృష్ణా – 14 లక్షలు
గుంటూరు – 11 లక్షలు
నెల్లూరు – 6 లక్షలు
మొత్తం: 1.48 కోట్లు షేర్ (2.35 కోట్ల గ్రాస్)
ఏపీ, తెలంగాణలో 4 రోజుల వసూళ్లు..
నైజాం – 2.59 కోట్లు
సీడెడ్ – 2.10 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.58 కోట్లు
ఈస్ట్ – 96 లక్షలు
వెస్ట్ – 78 లక్షలు
కృష్ణా – 79 లక్షలు
గుంటూరు – 1.05 కోట్లు
నెల్లూరు – 45 లక్షలు
మొత్తం: 10.37 కోట్లు షేర్ (గ్రాస్ 18.50 కోట్లు)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Box Office Collections, Master, Telugu Cinema, Tollywood, Vijay