Vijay Master: విజయ్ ‘మాస్టర్’ సినిమాను లీక్ చేసింది అతడే.. ఫిర్యాదు చేసిన చిత్ర యూనిట్..

విజయ్ మాస్టర్ సినిమా (Vijay Master movie)

Vijay Master: విడుదలకు ముందే సినిమాలు లీక్ కావడం అంటే చిన్న విషయం కాదు. కానీ విజయ్ మాస్టర్ సినిమాకు ఇదే జరిగింది. విడుదలకు రెండు రోజుల ముందు మాస్టర్ నెట్‌లో దర్శనమిచ్చింది. కొన్ని సన్నివేశాలు బయటికి కావడంతో..

  • Share this:
విడుదలకు ముందే సినిమాలు లీక్ కావడం అంటే చిన్న విషయం కాదు. కానీ విజయ్ మాస్టర్ సినిమాకు ఇదే జరిగింది. విడుదలకు రెండు రోజుల ముందు మాస్టర్ నెట్‌లో దర్శనమిచ్చింది. కొన్ని సన్నివేశాలు బయటికి కావడంతో చిత్ర దర్శక నిర్మాతలతో పాటు అంతా తలలు పట్టుకున్నారు. దయచేసి వచ్చిన సన్నివేశాలు బయటికి మరింత స్ప్రెడ్ చేయొద్దు అంటూ వేడుకున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇదిలా ఉంటే అసలు మాస్టర్ సినిమా లీక్ ఎలా అయింది.. ఎలా జరిగింది.. దానికి కారణం ఎవరు అనేది కొన్ని గంటల పాటు ఎవరికీ అర్థం కాలేదు. నేషనల్ వైడ్‌గా మాస్టర్ లీక్ విషయం సంచలనంగా మారింది. అసలు విడుదలకు ముందు సినిమా ఎలా బయటికి వచ్చింది.. అంత ఛాన్స్ ఎవరు తీసుకున్నారు.. అసలు అలా ఎలా సాధ్యమైంది.. సినిమాకు పని చేసిన వాళ్లకు తప్ప బయటి వాళ్లకు ఎలా సాధ్యమవుతుంది ఇది అంటూ చాలా మందికి ఎన్నో అనుమానాలు వచ్చాయి. అలాంటి సమయంలో మాస్టర్ లీక్ వెనక ఉన్నది ఎవరో తెలిసిపోయింది. ఈ సినిమా సన్నివేశాలను లీక్ చేసింది ఎవరో కాదు.. ఓ థియేటర్ ఉద్యోగి. చెన్నైలో ప్రతిష్టాత్మకమైన ఓ థియేటర్‌కు మాస్టర్ సినిమా ప్రింట్ వచ్చింది. అక్కడ్నుంచి ఈ సినిమా సన్నివేశాలు లీక్ అయ్యాయని తెలిసింది.

master movie leaked,master movie leaked telegram,attarintiki daredi movie leaked,yevadu movie leaked,master movie vijay sethupathi leaked scene,master movie scene leaked,master movie scenes leaked,master full movie leaked issues,master opening scene leaked,master leaked scenes,vijay master movie leaked,మాస్టర్ సినిమా లీక్,విజయ్ మాస్టర్ లీక్ సన్నివేశాలు,అత్తారింటికి దారేది లీక్
విజయ్ మాస్టర్ (Vijay Master)


ఇదే విషయంపై క్లారిటీ కూడా వచ్చింది. దీంతో చిత్ర యూనిట్‌ సదరు ఉద్యోగిపై కంప్లైంట్‌ ఇచ్చారు కూడా. ఆ ఉద్యోగితో పాటు కంపెనీపై కూడా లీగల్‌ చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా మాళవికా మోహనన్‌ నటించింది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మాస్టర్ జనవరి 13న దాదాపు 2000 థియేటర్స్‌లో విడుదలవుతుంది.

master movie leaked,master movie leaked telegram,attarintiki daredi movie leaked,yevadu movie leaked,master movie vijay sethupathi leaked scene,master movie scene leaked,master movie scenes leaked,master full movie leaked issues,master opening scene leaked,master leaked scenes,vijay master movie leaked,మాస్టర్ సినిమా లీక్,విజయ్ మాస్టర్ లీక్ సన్నివేశాలు,అత్తారింటికి దారేది లీక్
విజయ్ మాస్టర్ పోస్టర్ (Thalapathy Vijay)


తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీలో మాస్టర్ విడుదలవుతుంది. దాదాపు 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది మాస్టర్. ఏదేమైనా మొత్తానికి మాస్టర్ లీక్ వెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోవడంతో ఊపిరి పీల్చుకుంది చిత్రయూనిట్.
Published by:Praveen Kumar Vadla
First published: