విజయ్ ఇమేజ్ ప్రస్తుతం తమిళనాట ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరస విజయాలతో నెంబర్ వన్ స్థానంపై కన్నేసాడు ఇళయ దళపతి. ప్రస్తుతం ఈయన అట్లీ కుమార్ దర్శకత్వంలో ‘బిగిల్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం బిగిల్ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 25న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో ‘తేరి’, ‘మెర్సల్’ సంచలన విజయాలు సాధించాయి.

తెలుగులో ‘విజిల్’ టైటిల్‌తో వస్తున్న ‘బిగిల్’ మూవీ (twiter/Photo)
తెలుగులోనూ ఈ రెండు సినిమాలు విజయ్ ఇమేజ్, మార్కెట్ పెంచేసాయి. బిగిల్ తెలుగులో విజిల్ పేరుతో వస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. నాలుగు రోజులుగా యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుంది బిగిల్ ట్రైలర్. ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు అట్లీ కుమార్. అక్కడ జరిగే అన్యాయాలను చూపిస్తున్నాడు అట్లీ. బిగిల్ ట్రైలర్ అంతా విజయ్ తానొక్కడే నడిపించాడు. మూడు భిన్నమైన గెటప్స్ ఈ చిత్రానికి హైలైట్.

ఇళయతలపతి విజయ్
ఇందులో విజయ్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటించాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్, యోగిబాబు, డేనియల్ బాలాజీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్. ‘విల్లు’ తర్వాత మరోసారి ఈ జోడీ కలిసి నటిస్తున్నారు. మొత్తానికి తెరీ, మెర్సల్ తర్వాత విజయ్, అట్లీ మరో సంచలనానికి తెరతీస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:October 17, 2019, 18:07 IST