Home /News /movies /

Thalapathy Vijay remuneration: బాబోయ్.. 100 కోట్ల పారితోషికం అందుకోనున్న దళపతి విజయ్..?

Thalapathy Vijay remuneration: బాబోయ్.. 100 కోట్ల పారితోషికం అందుకోనున్న దళపతి విజయ్..?

దళపతి విజయ్ (Thalapathy Vijay)

దళపతి విజయ్ (Thalapathy Vijay)

Thalapathy Vijay remuneration: ఒక్క సినిమాకు 100 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు.. ఈ మధ్యే ప్రభాస్(Prabhas) సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇప్పుడు మరో హీరో కూడా 100 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాడు. ఆయనెవరో కాదు.. దళపతి విజయ్(Thalapathy Vijay).

ఇంకా చదవండి ...
ఒక్క సినిమాకు 100 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ప్రభాస్ తప్ప అంత పారితోషికం ఎవరూ తీసుకోలేదు.. రజినీకాంత్ కూడా 90 కోట్ల వరకు అందుకున్నాడు. ఈ మధ్యే ప్రభాస్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అది కూడా పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఈయన మార్కెట్ చూసి నిర్మాతలు 100 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు మరో హీరో కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఆయన మరెవరో కాదు.. తమిళ స్టార్‌ హీరో విజయ్‌. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈయన పారితోషికం కూడా ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన పారితోషికమే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాజాగా సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈయన. దీనికి 80 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా విజయ్ సినిమాలు వరసగా విజయం సాధిస్తున్నాయి.

తెరీ.. మెర్సల్.. బిగిల్.. సర్కార్.. మాస్టర్.. ఇలా ఒకదాన్ని మించి మరో సినిమా సంచలన వసూళ్లు సాధిస్తున్నాయి. తెలుగులోనూ ఈ సినిమాలన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. దాంతో ఇప్పుడు రెండు ఇండస్ట్రీలలో మంచి మార్కెట్ వచ్చేసింది. దాంతో విజయ్‌కు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీగానే ఉన్నారు. ఈయన సినిమాలు దాదాపు 300 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి.
Thalapathy Vijay,Thalapathy Vijay twitter,Thalapathy Vijay movies,Thalapathy Vijay telugu movie,Thalapathy Vijay vamsi paidipally movie,Thalapathy Vijay dil raju vamsi paidipally movie,telugu cinema,విజయ్,విజయ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా,విజయ్ వంశీ పైడిపల్లి దిల్ రాజు సినిమా
దళపతి విజయ్ (Thalapathy Vijay)

నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాకు 80 కోట్లు అందుకుంటున్న విజయ్.. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం కోసం ఏకంగా 100 కోట్లు అందుకోబోతున్నాడు విజయ్. ఇప్పటికే దిల్ రాజు నుంచి 10 కోట్ల అడ్వాన్స్ కూడా వెళ్లిందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే కానీ నిజమైతే విజయ్ సరికొత్త సంచలనానికి తెర తీసినట్లే.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kollywood, Tamil Cinema, Telugu Cinema, Vijay

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు