విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. టాలీవుడ్లో ఇప్పటికే ప్రముఖ హీరోలందరితో నటించిన రష్మిక అటు తమిళంలో కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటుంది. తమిళ,తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో రష్మిక టాప్ హీరోయిన్గా ఎదిగింది.
ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా తరువాత రష్మిక నేషనల్ స్టార్ గా ఎదిగింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తమిళ సూపర్ స్టార్ దళపతితో కొత్త చిత్రంలో నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ నిర్మాణంలో వైభవంగా భారీ చిత్రం ప్రారంభమైంది.
దళపతి విజయ్ కధానాయకుడి గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు చెన్నైలో పూజా కార్యక్రమాలతో వైభవం గా ప్రారంభమైన ఈ చిత్రం, ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుటుంది. ఈ పూజా కార్యక్రమాల్లో విజయ్‌తో పాటు రష్మిక కూడా పాల్గొంది. ఈ సందర్బంగా రష్మిక విజయ్‌కు రెండు చేతులతో దిష్టి చేస్తూ హల్ చల్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వైపు విజయ్ బీస్ట్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అటు విజయ్ 66 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భారీతారాగణం కనువిందు చేయనుంది. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేయనున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు. ఈ చిత్రం కోసం వంశీ పైడిపల్లి అద్భుతమైన కథని సిద్దం చేశారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.