Home /News /movies /

THALAPATHY VIJAY 27 YEARS RECORD BROKEN DUE TO CORONA VIRUS PK

Thalapathy Vijay: కరోనా దెబ్బకు విజయ్ 27 ఏళ్ల అరుదైన రికార్డు ఫసక్..

ఈ ఏడాది ఆయన కాలెండర్ ఇయర్ ఖాళీ. అయినా కూడా ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్ ఇది. 60కి పైగా సినిమాలు చేసిన విజయ్.. గత 27 ఏళ్లుగా బిజీగానే ఉన్నాడు.

ఈ ఏడాది ఆయన కాలెండర్ ఇయర్ ఖాళీ. అయినా కూడా ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్ ఇది. 60కి పైగా సినిమాలు చేసిన విజయ్.. గత 27 ఏళ్లుగా బిజీగానే ఉన్నాడు.

Thalapathy Vijay: విజయ్ అంటే ఒకప్పుడు తెలుగులో చాలా తక్కువగా చూసేవాళ్లు. ఈయన సినిమాలు తెలుగులో కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావంటూ వెక్కిరించేవాళ్లు.

విజయ్ అంటే ఒకప్పుడు తెలుగులో చాలా తక్కువగా చూసేవాళ్లు. ఈయన సినిమాలు తెలుగులో కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావంటూ వెక్కిరించేవాళ్లు. కానీ ఇప్పుడు విజయ్ అంటే తెలుగులోనూ ఫుల్ క్రేజ్. గత కొన్నేళ్లుగా ఈయన చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న కథలు తెలుగులో కూడా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ హీరో కోరుకోని ఓ రికార్డు ఒకటి వచ్చింది. 27 ఏళ్లుగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్న రికార్డుకు ఇప్పుడు బ్రేక్ పడింది. దానికి కారణం కరోనా వైరస్. ఈ వైరస్ కారణంగా గత ఆర్నెళ్లుగా సినిమాలు విడుదల కావడం లేదు. థియేటర్స్ అన్నీ మూసేసి ఉండటంతో రిలీజ్ కావాల్సిన సినిమాలు చాలా వరకు ఆగిపోయాయి. అందులో విజయ్ సినిమా కూడా ఉంది. ఈయన నటించిన మాస్టర్ మే లోనే విడుదల కావాల్సి ఉంది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఖైదీ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత లోకేష్ చేసిన సినిమా ఇది.

దళపతి విజయ్ (Thalapathi Vijay)
దళపతి విజయ్ (Thalapathi Vijay)


పైగా విజయ్ హీరో కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మాస్టర్ సినిమాను ఓటిటిలో విడుదల చేస్తారనే వార్తలు వచ్చినా కూడా అది వర్కవుట్ కాదని నిర్మాతలు తెలిపారు. 100 కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చినా కూడా నో చెప్పారు నిర్మాతలు. ఇక థియేటర్స్‌లో కూడా ఈ ఏడాది మాస్టర్ రావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే 2020లో మాస్టర్ విడుదల చేయకూడదని ఫిక్స్ అయ్యారు దర్శక నిర్మాతలు. దాంతో 27 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది.

దళపతి విజయ్ (Thalapathi Vijay)
దళపతి విజయ్ (Thalapathi Vijay)


దళపతి కెరీర్‌లో తొలిసారి ఓ కాలెండర్ ఇయర్ ఖాళీగా వెళ్ళిపోతుంది. 1992లో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత గత 27 ఏళ్లుగా విజయ్ ప్రతి సంవత్సరం కనీసం ఒక్క సినిమాను అయినా విడుదల చేస్తూ వస్తున్నాడు. ఇన్నాళ్లలో ఒక్క ఏడాదిని కూడా ఆయన ఖాళీగా వదల్లేదు. కానీ 2020 కరోనా పుణ్యమా అని తప్పట్లేదు. ఈ ఏడాది ఆయన కాలెండర్ ఇయర్ ఖాళీ. అయినా కూడా ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్ ఇది. 60కి పైగా సినిమాలు చేసిన విజయ్.. గత 27 ఏళ్లుగా బిజీగానే ఉన్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood, Vijay

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు