స్టార్ హీరో పుట్టిన‌రోజు నాడు బంగారు ఉంగరాలు పంచిన అభిమానులు..

విజ‌య్.. ద‌ళ‌ప‌తి విజ‌య్.. ఈ పేరుకు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌జినీకాంత్ కూడా ఇప్పుడు విజ‌య్ త‌ర్వాత ఉన్నాడంటే అతిశ‌యోక్తి కాదేమో..? అంత‌గా త‌న సినిమాల‌తో దుమ్ము దులిపేస్తున్నాడు ఈయ‌న‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 23, 2019, 4:50 PM IST
స్టార్ హీరో పుట్టిన‌రోజు నాడు బంగారు ఉంగరాలు పంచిన అభిమానులు..
విజయ్ బిగిల్ సినిమా ఫస్ట్ లుక్
  • Share this:
విజ‌య్.. ద‌ళ‌ప‌తి విజ‌య్.. ఈ పేరుకు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌జినీకాంత్ కూడా ఇప్పుడు విజ‌య్ త‌ర్వాత ఉన్నాడంటే అతిశ‌యోక్తి కాదేమో..? అంత‌గా త‌న సినిమాల‌తో దుమ్ము దులిపేస్తున్నాడు ఈయ‌న‌. జూన్ 22న ఈయ‌న పుట్టిన రోజు. దాంతో విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అట్లీ తెర‌కెక్కిస్తున్న బిగిల్ సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేసారు. ఇక అభిమానులు మాత్రం త‌మ హీరో పుట్టిన రోజును చాలా అద్భుతంగా జ‌రుపుకున్నారు. త‌మిళ‌నాడులో చాలా చోట్ల విజ‌య్ ఫ్యాన్స్ అసోషియేష‌న్స్ త‌మ హీరో పేరు మీద మంచి ప‌నులు చేసారు.
Thalapathi Vijay fans celebrates their hero birthday in grand manner and distributed gold rings in Hospital pk.. విజ‌య్.. ద‌ళ‌ప‌తి విజ‌య్.. ఈ పేరుకు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌జినీకాంత్ కూడా ఇప్పుడు విజ‌య్ త‌ర్వాత ఉన్నాడంటే అతిశ‌యోక్తి కాదేమో..? అంత‌గా త‌న సినిమాల‌తో దుమ్ము దులిపేస్తున్నాడు ఈయ‌న‌. vijay birthday,vijay fans,vijay fans distributed gold rings,vijay birthday special,vijay birthday celebration,thalapathy vijay,thalapathy vijay birthday,vijay birthday special 2019,happy birthday vijay,vijay,vijay birthday status 2019,vijay 63,bigil vijay,vijay birthday 2019,vijay 45th birthday,vijay birthday status,thalapathy birthday,bigil - vijay 63,vijay 63 first look,vijay birthday celebrations,thalapathy birthday special,vijay birthday whatsapp status,telugu cinema,విజయ్,విజయ్ గోల్డ్ రింగ్స్,విజయ్ అభిమానులు,విజయ్ బర్త్ డే,తెలుగు సినిమా
విజయ్ ఫైల్ ఫోటో

పళ్లిపట్టు రాధానగర్‌ విజయ్‌ ప్రజా సంఘం ఆధ్వర్యంలో అక్క‌డి బస్టాండులో ఏర్పాటు చేసిన పేదలకు అన్నదానం చేశారు. మ‌రికొంద‌రు అభిమానులు విజ‌య్ పేరు చెప్పి గుళ్లో అభిషేకాలు చేయించారు. మ‌రికొంద‌రు స్వీట్స్ పంచారు. ఆ త‌ర్వాత వేలూరు పెట్‌లాండ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 22న జన్మించిన చిన్నారులకు బంగారు ఉంగరాలను పంచారు. ఇప్ప‌టికీ విజ‌య్ కూడా త‌న పుట్టిన రోజు నాడు ఓ హాస్పిట‌ల్ వెళ్లి అక్క‌డ ఆ రోజు పుట్టిన పిల్ల‌ల‌కు గోల్డ్ రింగ్స్ ఇవ్వ‌డం ఆన‌వాయితీ. అభిమానులు కూడా ఇప్పుడు ఇదే ఫాలో అయ్యారు.

First published: June 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>