జయలలిత బయోపిక్‌లో శోభన్ బాబు పాత్రపై క్లారిటీ..

Thalaivi Biopic: ప్రముఖ నటి, పొలిటీషియన్ జయలలిత జీవితం ఆధారంగా విజయ్ డైరెక్షన్‌లో 'తలైవి' సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 17, 2020, 11:53 AM IST
జయలలిత బయోపిక్‌లో శోభన్ బాబు పాత్రపై క్లారిటీ..
జయలలిత, శోభన్ బాబు Twitter
  • Share this:
Thalaivi Update : ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. అందులో భాగంగా క్రీడాకారుల నుంచి సినీ నటులు, రాజకీయ నాయకుల జీవితాలను కూడా తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా గ్లామర్‌ రంగం నుంచి తమిళ రాజకీయ అరంగేట్రం చేసి దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితపై ఓ బయోపిక్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తలైవిగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్‌‌ను వదులుతోంది చిత్రబృందం. 'తలైవి'గా హిందీ నటి కంగనా రనౌత్ నటిస్తోండగా.. మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి స్టార్ హీరో ఎంజీ రామచంద్రన్‌ పాత్రలో విలక్షణ నటుడు అరవింద్‌ స్వామి నటిస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన ఆయన లుక్‌కి విశేష స్పందన దక్కింది. 'తలైవి'ని ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అది అలా ఉంటే జయలలిత, శోభన్ బాబు మధ్య ప్రత్యేకమైన అనుబంధం వుందని అంటారు వీరి అభిమానులు. ఆ విషయాలను కూడా ఈ సినిమాలో చర్చించనుంది చిత్రబృందం. అందులో భాగంగా శోభన్ బాబు పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.


thalaivi movie updates, jayalalitha biopic latest updates, thalaivi news, thalaivi teaser, thalaivi first look, thalaivi trailer, kangana ranaut thalaivi,thalaivi kangana ranaut, thalaivi first look teaser,thalaivi movie trailer,thalaivi kangana ranaut,thalaivi first look reaction,thalaivi teaser reaction,thalaivi official teaser,puratchi thalaivi,thalaivi tamil movie,thalaivi first look review,thalavi release,kangana ranaut thalaivi makeup,thalaivi movie,thalaivi troll,thalaivi in hindi,జయలలిత బయోపిక్‌,శోభన్ బాబు,తలైవి,
జిషు సేన్ గుప్తా, కంగనా Twitter


జిషు సేన్ గుప్తా తాజాగా తెలుగులో విడుదలైన 'అశ్వద్ధామ'లో విలన్‌గా అదరగొట్టాడు. తలైవి తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోను విడుదల కానుంది. ఈ సినిమాను విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు. జూన్‌ 26న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు