THALA AJITH KUMAR GETS INJURED IN THE SHOOT OF VALIMAI MOVIE AND ADMITS IN HOSPITAL PK
Ajith Kumar Accident: తమిళ హీరో అజిత్‌కు ప్రమాదం.. కాళ్లు, చేతులకు గాయాలు..
అజిత్ కుమార్ (Ajith Kumar)
Ajith Kumar Accident: తమిళ సూపర్ స్టార్ అజిత్ గాయాలపాలయ్యాడు. షూటింగ్ చేస్తుండగా ఈయనకు యాక్సిడెంట్ అయింది. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ అది చిన్నదే అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తమిళ సూపర్ స్టార్ అజిత్ గాయాలపాలయ్యాడు. షూటింగ్ చేస్తుండగా ఈయనకు యాక్సిడెంట్ అయింది. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ అది చిన్నదే అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా చాలా సార్లు అజిత్ ఇలా గాయాల పాలయ్యాడు. ఇప్పుడు మరోసారి ఇదే సీన్ రిపీట్ అయింది. అభిమానుల కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు స్టార్ హీరో అజిత్. అందుకే తరుచుగా షూటింగ్స్‌లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. ప్రస్తుతం ఈయన సిహెచ్ వినోద్ దర్శకత్వంలో వలిమై సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోనే వేగంగా జరుగుతుంది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని సిటీలోనే భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు దర్శకుడు వినోద్. ఇక్కడే బైక్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లోనే ఫిబ్రవరిలో గాయపడ్డాడు అజిత్. అప్పుడు కూడా ఓ భారీ యాక్షన్ సన్నివేశం కోసం బైక్ చేజింగ్ చేస్తున్న తరుణంలో అజిత్‌కు ప్రమాదం జరిగింది.
అజిత్ (ajith accident)
షూట్ చేస్తుండగా బైక్ స్కిడ్ కావడంతో ఆయన కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అజిత్ స్వల్ప గాయాలతో బయటపడటం శుభసూచకం. అయితే ఈ గాయాలు మాని కాస్త బాగుంది అనుకుంటున్న తరుణంలో మరోసారి ప్రమాదంలో గాయపడ్డాడు అజిత్. ఈ ప్రమాదంలో అజిత్ చేతులకి, కాళ్ళకి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు అజిత్. కొన్ని రోజుల పాటు ఆయన షూటింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు ప్రచారం జరుగుతుంది.
అజిత్ (ajith accident)
గతంలో ఓ సారి ఇలాగే ప్రమాదం జరిగితే 20 నిమిషాల విశ్రాంతి తర్వాత మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నాడు అజిత్. ఆ సీన్ షూటింగ్ పూర్తైన తర్వాతే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు మాత్రం అలా కుదరదు అంటున్నారు వైద్యులు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో వారం రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. సాధారణంగా బైక్ రేస్ సీన్స్ అంటే అజిత్‌కు చాలా యిష్టం. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. అనుకోకుండా ప్రమాదం జరగడంతో చిత్రయూనిట్ కూడా కంగారు పడ్డారు. సీరియస్ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.