Home /News /movies /

THALA AJITH BIKE RIDE FROM HYDERABAD TO CHENNAI 650 KM AND PICS GOING VIRAL PK

అజిత్ 600 కిమీ బైక్ రైడ్.. లాక్ డౌన్ వేళ సంచలన నిజం..

అజిత్ బైక్ రైడ్ (ajith bike ride)

అజిత్ బైక్ రైడ్ (ajith bike ride)

Ajith Bike ride: దక్షిణాది ఇండస్ట్రీలో బైక్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు తమిళ సూపర్ స్టార్ తల అజిత్‌. ఈయనకు బైక్‌లంటే విపరీతమైన ఇష్టం... కాదు కాదు ప్రాణం. ప్రొఫెషనల్ రేసింగ్‌లో..

దక్షిణాది ఇండస్ట్రీలో బైక్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు తమిళ సూపర్ స్టార్ తల అజిత్‌. ఈయనకు బైక్‌లంటే విపరీతమైన ఇష్టం... కాదు కాదు ప్రాణం. ప్రొఫెషనల్ రేసింగ్‌లో కూడా పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు అజిత్. ప్రతీ సినిమాలో కూడా కచ్చితంగా ఒక్కటైనా ఛేజ్ సీన్ కూడా ప్లాన్ చేస్తుంటాడు ఈయన. అజిత్ బైక్ రైడింగ్ కెపాసిటీ తెలిసి దర్శకులు కూడా అలాంటి యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈయన వాలిమై సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అజిత్ చేసిన ఓ పని గురించి కాస్త ఆలస్యంగా ఓ నిజం బయటికి వచ్చింది.
అజిత్ బైక్ రైడ్ (ajith bike ride)
అజిత్ బైక్ రైడ్ (ajith bike ride)

ఈయనకు బైక్ రైడ్ అంటే ఎంతగా ఇష్టమనేది తాజాగా జరిగిన సంఘటన మరోసారి తెలిసేలా చేస్తుంది. ఈ మధ్యే ఓ సారి హైదరాబాద్ టూ చెన్నై దాదాపు 650 కిలోమీటర్లు బైక్‌పై అజిత్ ఒంటరిగా ప్రయాణం చేసాడు. ఈ విషయాన్ని వాలిమై చిత్ర బృందమే కన్ఫర్మ్ చేసింది. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఆ మధ్య వాలిమై చిత్ర షూటింగ్ కొన్ని రోజలు హైదరాబాద్‌లోనే జరిగింది.
అజిత్ బైక్ రైడ్ (ajith bike ride)
అజిత్ బైక్ రైడ్ (ajith bike ride)

ఆ తర్వాత ఇక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక అజిత్ తన స్పెషల్ డిజైన్డ్ బైక్‌పై 650 కిలోమీటర్లు ఒక్కడే బైక్‌పై చెన్నైకి వచ్చేసాడు. ఆ లోపు తన అసిస్టెంట్ మాత్రం ఫ్లైట్‌లో వెళ్లిపోయాడు. విమాన టికెట్ కొనుక్కుని దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరి అజిత్ బైక్ రైడింగ్ చేసాడు. దారిలో ఆహారం, పెట్రోల్ కోసం తప్ప ఎక్కడా ఆగకుండా నాన్ స్టాప్ రైడ్ చేసాడు అజిత్. ప్రస్తుతం అజిత్ బైక్ రైడింగ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ajith, Tamil Cinema, Telugu Cinema

తదుపరి వార్తలు