హోమ్ /వార్తలు /సినిమా /

Thaggede Le Movie Review: ‘తగ్గేదే లే’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

Thaggede Le Movie Review: ‘తగ్గేదే లే’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

తగ్గేదే లే మూవీ రివ్యూ (Twitter/Photo)

తగ్గేదే లే మూవీ రివ్యూ (Twitter/Photo)

Thaggede Le Movie Review: ‘టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర హీరోగా నటించిన మూవీ ‘తగ్గేదే లే’. దండు పాళ్యం ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కించిన మూవీ ‘తగ్గేదే లే’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : తగ్గేదే లే (Thaggede Le)

నటీనటులు : నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా, నాగబాబు,డానీ కుట్టప్ప,రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, పూజా చంద్ర, అయ్యప్ప పి. శర్మ,పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్,30 ఇయర్స్ పృథ్వీ

ఎడిటర్:  వెంకట్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: గ్యారీ బి హెచ్

సంగీతం: చరణ్ అర్జున్

నిర్మాత : ప్రేమ్ కుమార్ పాండే, P.V.సుబ్బారెడ్డి

దర్శకత్వం: శ్రీనివాస్ రాజు

విడుదల తేది : 4/11/2022

టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర హీరోగా నటించిన మూవీ ‘తగ్గేదే లే’. దండు పాళ్యం ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కించిన మూవీ ‘తగ్గేదే లే’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

 కథ విషయానికొస్తే.. 

ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ఈశ్వర్ (నవీన్ చంద్ర) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇతను తన మేనత్త కూతురు (దివ్యా పిళ్లై)ని మ్యారేజ్ చేసుకుంటాడు. ఈ సందర్భంగా తనకు తెలిసిన వాళ్లను పిలిచి పెద్ద పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి ( అనన్యా సేన్ గుప్తా)ని ఈశ్వర్ ఒకింత ఆశ్యర్యవుతాడు. ఇతను లిజిని చూసి ఎందుకు షాక్ అయ్యాడు. అసలు ఈశ్వర్, లిజి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? ఆ తర్వాత ఈశ్వర్ ఇంట్లో ఓ మహిళ శవం దొరుకుతుంది. ఆమెను ఎవరు చంపారు ? ఈ నేపథ్యంలో ఈశ్వర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే తగ్గేదేలే మూవీ స్టోరీ.

కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే.. 

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెలుగులో ఎన్నో చిత్రాలొచ్చాయి. అలాంటి కోవలోనే తెరకెక్కిన మూవీ ‘తగ్గేదే లే’ మూవీ. దండుపాళ్యం ఎఫెక్టో ఏమో కానీ.. దర్శకుడు శ్రీనివాస్ రాజు కూడా ‘తగ్గేదే లే’ సినిమాను మర్డర్, మిస్టరీ, డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కించాడు. మొత్తంగా తాను ఏదైతే తెరకెక్కించాలనుకున్నాడో అదే తెర మీద చూపించాడు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ తడబడ్డ ఓవరాల్‌గా ఓ వర్గం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాకు చరణ్ అర్జున్ ఇచ్చిన సంగీతం బాగుంది. ఆర్ఆర్ చూస్తే ఎక్కడో విన్నట్టు అనిపించినా.. ఓవరాల్‌గా పర్వాలేదనిపిస్తోంది. సినిమాటోగ్రఫర్ వెంకట్ ప్రసాద్ విజువల్స్ బాగున్నాయి. గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. భద్ర ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే.. 

నవీన్ చంద్ర విషయానికొస్తే.. ఈయన ఇప్పటికే పలు చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌లో అలరిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా హాట్ స్టార్‌లో ’పరంపర’ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో లీనమై మరణించాడు. ఈయన భార్య పాత్రలో దివ్యా పిళ్లై సాధారణ గృహిణిగా అదరగొట్టింది. ఇక నవీన్ చంద్ర ప్రియురాలుగా అనన్యా సేన్ గుప్తా కూడా ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవి శంకర్ తన పాత్రకు న్యాయం చేసాడు. ఇక దండుపాళ్యం గ్యాంగ్ సభ్యులుగా మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, రవి కాలె, మరసారి తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో గెటప్ శ్రీను, ఆటో రామ్  ప్రసాద్‌లు ఉన్నంతలో పర్వాలేదనిపించారు. ఇక డాక్టర్ సమరం పాత్రలో 30 ఇయర్స్ పృథ్వీ అద్భుతంగా ఇరగదీసాడు.

ప్లస్ పాయింట్స్ 

నవీన్ చంద్ర నటన

విజువల్స్

రీ రికార్డింగ్

మైనస్ పాయింట్స్ 

రెగ్యులర్ స్టోరీ

ప్రేక్షకులకు కనెక్ట్ కానీ పాత్రలు

ఎడిటింగ్

చివరి మాట : తగ్గేదే లే.. ఓ వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేసే మూవీ

First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు