వెండితెరపై బాల్ థాక్రే జీవితం: శివసేన అధినేతగా మెరిసిన నవాజుద్దీన్ సిద్దిఖి

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. ఆయా రంగాలల్లో ఉన్న సక్సెస్ ఫుల్ పర్సనాలిటీస్ జీవితాన్ని వెండితెరపై చూపించడానికీ డైరెక్టర్లు ఉత్సాహాం చూపిస్తున్నారు. ఈ రూట్లోనే మరో లెజండరీ రాజకీయ నాయకుడు బాల సాహెబ్ థాక్రే జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు.

news18-telugu
Updated: December 27, 2018, 11:16 AM IST
వెండితెరపై బాల్ థాక్రే జీవితం: శివసేన అధినేతగా మెరిసిన నవాజుద్దీన్ సిద్దిఖి
బాల్ థాక్రే పాతర్లో నవాజుద్దీన్ సిద్దిఖి(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. ఆయా రంగాలల్లో ఉన్న సక్సెస్ ఫుల్ పర్సనాలిటీస్ జీవితాన్ని వెండితెరపై చూపించడానికీ డైరెక్టర్లు ఉత్సాహాం చూపిస్తున్నారు. ఈ రూట్లోనే మరో లెజండరీ రాజకీయ నాయకుడు బాల సాహెబ్ థాక్రే జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు.

బాల్ థాక్రే జీవితంలో ఉన్నంత మెలోడ్రామానే ఈ మూవీకి ప్రేరణ అని చెప్పొచ్చు. ఒక మాములు పత్రిక సంపాదకుడు కమ్ కార్టూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన బాల్ థాక్రే..ఆ తర్వాత శినసేన పార్టీని స్థాపించి భారత దేశ రాజకీయాల్లో సంచనలం క్రియేట్ చేసారు. తాజాగా ఆయన జీవితంపై తెరకెక్కిన ‘థాక్రే’ మూవీ ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్‌లో పాత్రికేయ వృత్తి నుంచి రాజకీయాల్లో అమేక శక్తిగా ఎదగడం...ఆనాటి హోం మంత్రి మొరార్జీ దేశాయ్‌ను ముంబాయిలో అడ్డుకోవడం. ఇందిరా గాంధీతో జై హింద్,జై మహారాష్ట్ర అంటూ చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.


వీర హిందూత్వవాది అయిన శివసేన అధినేత బాల్ థాక్రే పాత్రను ముస్లిమ్ అయిన నవాజుద్దీన్ సిద్ధీకి పోషించడం విశేషం. సినిమా ట్రైలర్ చూస్తుంటే నిజంగానే బాల్ థాక్రేనే చూస్తున్నట్టుగా ఉంది. అంతలా బాలా సాహెబ్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దీకి పరకాయ ప్రవేశం చేసాడా అనే రీతిలో నటించి మెప్పించారు.

అభిజిత్ పాన్సే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నిర్మించారు. మహారాష్ట్రల మతపరంగా..రాజకీయంగా కీలకమైన వ్యక్తి బాల్ థాక్రే. మహారాష్ట్రల మరాఠా భాషకే పట్టంకట్టి తీరాలంటూ తెగేసి చెప్పిన పెద్ద మనిషి బాలా సాహేబ్ థాక్రే.
ఈ మూవీలో 1992నాటి బాబ్రీ ఘటన... ఆ తర్వాత 1993లో ముంబాయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలను ఈ మూవీలో ప్రస్తావించారు. ఈ మూవీని రిపబ్లిక్ డే కానుకగా జనవరి25న విడుదల చేయనున్నారు. మొత్తానికి దేశ రాజకీయాలను మలుపు తిప్పిన బాల్ థాక్రే జీవితం వెండితెరపై ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి

ఒక్క హిట్ ప్లీజ్.. ఫ్లాపుల్లో మునిగిపోయిన తెలుగు హీరోలు..

#FlashBack2018: ఈ ఏడాది స‌త్తా చూపించిన కొత్త ద‌ర్శ‌కులు వీళ్లే..

‘మహానటి’ని ఎన్టీఆర్ బీట్ చేస్తాడా..
First published: December 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు