టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ``ఆర్ఆర్ఆర్``. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ ఎన్నో అవార్డులు సాధించింది. ఆర్ఆర్ఆర్ ``నాటు నాటు`` పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్‌ను కూడా దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (Best Original Song category) కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. ఈ పాటపై సోషల్ మీడియా చూపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు. గత రెండు నెలలుగా ఈ పాట సోషల్ మీడియా ట్రెండింగ్‌లో (Trending Song) టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇతర దేశస్థులు కూడా ఈ పాటకు తమదైన శైలిలో చిందులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఈ పాట సాహిత్యానికి సంబంధించిన శబ్ద సౌందర్యం, సంగీతం, ఐకానిక్ డ్యాన్స్ స్టెప్పు భాషలకు అతీతంగా నాటు నాటు పాటను వివిధ దేశాల ప్రజలకు బాగా దగ్గరైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాటు నాటు పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో వీటన్నింటిని మించిపోయే సన్నివేశం ఆవిష్కృతమైంది.
Must watch! Tesla lights sync with the beats of Oscar winning song Naatu Naatu in New Jersey, USA. ???????? pic.twitter.com/xHAqWXvFyw
— Megh Updates ????™ (@MeghUpdates) March 20, 2023
ఇటీవల ప్రభుదేవా కూడా 100 మందితో కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసి, ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో వీటన్నింటిని మించిపోయే సన్నివేశం ఆవిష్కృతమైంది. వందల సంఖ్యలో టెస్లా కార్లను ఒక్కచోట చేర్చి నాటు నాటు పాట వినిపించారు. ఆ పాటకు అనుగుణంగా టెస్లా కార్ల లైట్లు ఆరుతూ, వెలుగుతూ.. పాటకు తగ్గట్టుగా విన్యాసాలు చేశాయి. వందల సంఖ్యలో టెస్లా కార్లను ఒక్కచోట చేర్చి నాటు నాటు పాట వినిపించారు. నాటు నాటు పాటకు కార్ల లైటింగ్ విన్యాసాలు అదిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు ``నాటు నాటు`` పాట సామాన్యులనే కాదు.. సెలబ్రిటీలను కూడా మెప్పించి ఆడిస్తోంది. ఇప్పటికే చాలా మంది సినీ, క్రీడా సెలబ్రిటీలు సైతం ఆ పాటకు చిందులేసి ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆస్కార్ వేదిక మీద కూడా ఈ పాటకు విదేశీ డ్యాన్సర్లు చిందులేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ ఊపేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Ram Charan, RRR