TENSION AT RRR MOVIE THEATRES AS FANS WAR STARTED IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
RRR Movie: ఆర్ఆర్ఆర్ థియేటర్లో ఫ్యాన్స్ వార్.. ఏపీలో మొదలైన రచ్చ..
ఆర్ఆర్ఆర్ వద్ద ఫ్యాన్స్ హంగామా
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie Release) విడుదలైంది. అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షో (RRR Premier Shows) లు మొదలైపోయాయి. థియేటర్ల దగ్గర రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ ( NTR)ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie Release) విడుదలైంది. అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షో (RRR Premier Shows) లు మొదలైపోయాయి. థియేటర్ల దగ్గర రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ ( NTR)ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే మార్నింగ్ షోలకు వెళ్లేవాళ్లు కూడా థియేటర్ల వద్దకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) లో ఇదే పరిస్థితి నెలకొంది. ఐతే టికెట్ల విషయంలో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ డేకి సంబంధించి ఆన్ లైన్లో టికెట్లు దొరక్కపోగా బ్లాక్ లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా స్టార్ట్ అయింది. కొన్ని థియేటర్ల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అప్పుడే ఫ్యాన్స్ వార్ మొదలైపోయింది. చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చురేగింది. ఫ్యాన్స్ షో టిక్కెట్ల విషయంలో అభిమానుల మధ్య గొడవ స్టార్ట్అయింది. టికెట్లపై ఓ హీరో అభిమాన సంఘం నేతల పేర్లు ముద్రించండంతో మరో హిరో అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. థియేటర్ ఎదుటే సినిమా టికెట్లు చించేసి హంగామా సృష్టించారు.
కుప్పంలోని మూడు థియేటర్లలో మూడు బెనిఫిట్ షోలకు సంబంధించి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫోటోలతో టికెట్లు ముద్రించారు. ఐతే సినిమా టికెట్లపై కొంతమంది అభిమాన సంఘం నేతల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉండటమే అభిమానుల మధ్య గొడవకు కారణమైంది. ఐతే ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవడంతో వివాదం సర్దుమణిగింది.
ఇదిలా ఉంటే శ్రీకాళహస్తిలోని ఓ థియేటర్ పై అభిమానులు విరుచుకుపడ్డారు. ఫ్యాన్స్ షో వేస్తున్నామని ప్రకటించి టికెట్లు ఆన్ లైన్లో కాకుండా ఆఫ్ లైన్లో విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అద్దాలు, తలుపులను ధ్వంసం చేశారు. ఫ్యాన్సీ షోకి ఇవ్వవలసిన టికెట్లు ఇప్పటిదాకా ఇవ్వకపోగా ఒక టిక్కెట్టు ₹500 అవి కూడా లేవు అంటూ సినిమా అభిమానులను రెచ్చగొట్టే విధంగా థియేటర్ యాజమాన్యం వ్యవహరిస్తుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇక విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఆర్ఆర్ఆర్ టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారంటూ ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. ఆన్ లైన్లో టికెట్లు బ్లాక్ చేసి.. బహిరంగంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఇటువైపు చూడటం లేదని మండిపడుతున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.