సాధారణ ఎన్నికలను తలపిస్తూ మా అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. రిగ్గింగ్ ఆరోపణలకుతోడు తోపులాటలూ చోటుచేసుకున్నాయి. బయటి వ్యక్తి ఒకరు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఓటేశారనే వివాదం, పోలింగ్ కేంద్రం బయట నెలకొన్న వాతావరణంపై ఇరు వర్గాల ప్రతినిధులకు ఎన్నికల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రస్తుత మా ప్రెసిడెంట్ నరేశ్, ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ప్రకాశ్ రాజ్ మధ్య వాగ్వాదం దృశ్యాలు సంచలనం రేపుతున్నాయి..
నరేశ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్
దొంగ ఓటు ఆరోపణల నేపథ్యంలో పరుగెత్తుతోన్న ఓ వ్యక్తిని నటుడు నరేశ్ పట్టుకోడానికి ప్రయత్నించడం, అంతలోనే అటుగా వచ్చిన ప్రకాశ్ రాజ్.. ‘వాణ్ని కాదు.. నన్ను కొట్టండి.. నన్ను కొట్టు..’ అంటూ నరేశ్ మీదికి ఉరకడం అక్కడున్నవాళ్లను షాక్ కు గురిచేసింది. ఓవైపు గొడవలు పడుతూనే, మాలో మాకు ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసే ఉంటామని, ఎవరు గెలిచినా అందరూ గెలిచినట్లేనని ఇరు వర్గాలు స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. కాగా,
భారీ బందోబస్తు..
మా ఎన్నికల్లో రెండు వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగుతోన్నక్రమంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రమైన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిపై వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఓట్లేసేందుకు వచ్చిన సినీ ప్రముఖుల్ని చూసేందుకు జనం కూడా ఎగబడుతున్నారని, పరిస్థితిని అదుపులో ఉంచామని, ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరుగుతోందని, కౌంటింగ్ ప్రక్రియకు కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని డీసీపీ చెప్పారు. అనూహ్యరీతిలో..
మానభంగం జరిగిందా?
మా ఎన్నికల్లో భాగంగా ఓటేసేందుకు వచ్చిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ పోలింగ్ కేంద్రం వద్ద గొడవలపై స్పందించారు. ‘ఏం గొడవ? ఎన్నికలు అన్నాక గొడవలు జరగవా? మర్డర్లు, మానభంగాలు జరగట్లేదు కదా.. కామ్ గా, బ్రహ్మాండమైన ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.. తప్పకుండా ఎవరో ఒకరు గెలుస్తారు.. 26 మందిలో 26 మందీ గెలుస్తారు.. ప్రెసిడెంట్ గా ఒకరు, వైస్ ప్రెసిడెంట్ గా ఒకరు గెలుస్తారు.. ఇంకేం కావాలి? కచ్చితంగా చెప్పాలంటే నేను ఓటేసిన వాళ్లే గెలుస్తారు..’ అని బండ్ల గణేశ్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, MAA, MAA Elections, Prakash Raj, Tollywood