ఫిల్మ్ చాంబర్ ముందు యువ హీరో ఆత్మహత్య యత్నం..

తెలుగు యువ హీరో తన సినిమాకు అన్యాయం జరిగిందని ఫిల్మ్ చాంబర్ ముందు పురుగుల మందు తాగబోయాడు.

news18-telugu
Updated: December 11, 2019, 2:37 PM IST
ఫిల్మ్ చాంబర్ ముందు యువ హీరో ఆత్మహత్య యత్నం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
'నానిగాడు' సినిమా విడుదల కాకుండానే యూట్యూబ్ లో ప్రత్యేక్షమైంది. దీంతో  ఈ  సినిమా హీరో దుర్గా ప్రసాద్ ఈ రోజు ఉదయం నిరసనకు దిగాడు. ఆయన మాట్లాడుతూ.. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని రిలీజ్ రెడీ అవుతోన్న నాని గాడి సినిమాను ఎవరో కావాలనే యూట్యూబ్‌లో ఉంచారని ఆరోపించాడు.  అందులో భాగంగా దుర్గాప్ర‌సాద్ ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద తన నిర‌స‌నను వ్య‌క్తం చేసాడు. తాను  40 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి సినిమా చేసానని... సినిమా సెన్సార్ కూడా పూర్త‌యిందని.. ఇంతలో కావాలనే తమపై కక్ష్య గట్టి విడుద‌ల‌కు రెడీ అవుతోన్న స‌మ‌యంలో మొత్తం సినిమాను యూ ట్యూబ్ లో పెట్టేసారని ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాం అని పేర్కోన్నాడు.  అంతేకాదు ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని లేకుంటే ఫిల్మ్ చాంబర్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన అతను.. ఫిలిం చాంబర్ ముందు పురుగుల మందు తాగాడు. అయితే ఈ విషయంపై  అప్రమత్తమైన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో దుర్గా ప్రసాద్‌ను దవాఖానకు తరలించారు.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ పిక్స్..


First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>