VIshnu Priya: బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ. తన గ్లామర్ తో మంచి ఫాలోయింగ్ అందుకుంది. ఈమధ్య తన పరిచయాన్ని మరింత పెంచుకుంది ఈ హాట్ బ్యూటీ. యాంకర్ అనసూయ, శ్రీముఖి లను మించి పోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. పోవే పోరా షో తో మంచి ఫేమ్ అందుకుంది. అంతేకాకుండా పలు షోలలో కూడా తన పర్ఫామెన్స్ బాగా మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే అక్కినేని అఖిల్ పై ఉన్న ప్రేమను బయటపెట్టేసింది విష్ణు ప్రియ.
స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో ఎంటర్టైన్మెంట్ స్టార్ మ్యూజిక్. ఇక ఈ షోకు సుమ యాంకరింగ్ చేస్తూ తన మాటలతో బాగా సందడి చేస్తుంది. ఇందులో ప్రతి ఎపిసోడ్ తో సెలబ్రెటీలను ఆహ్వానిస్తూ వారితో బాగా ఆట పట్టిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవలే యాంకర్ విష్ణు ప్రియ, శ్రీముఖి, రోల్ రైడా తో పాటు పలువురు పాల్గొన్నారు.ఇక తమ ఆటలతో బాగా సందడి చేశారు. సుమ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ఇక ఇందులో ఓ రౌండ్ లో విష్ణు ప్రియ పాల్గొన్నది. అందులో ఓ గదిలో ఏ బి సి డి అనే నాలుగు సూట్ కేసులు ఉంటాయి. అందులో తను ఏ సూట్ కేసు ను తీసుకు వస్తుందోనని మిగతా వారు ఆతృతగా చూస్తారు. ఇక అక్కడ గమనిస్తున్న శ్రీముఖి.. విష్ణు ప్రియ తీసుకోబోయే సూట్కేసును ముందే చెప్పేసింది. అది కూడా ఏ అని రాసి ఉన్న సూట్ కేసు ను తీసుకుంటుందని ఆ లెటర్ తనకు సెంటిమెంట్ అని, అక్కినేని అఖిల్ అంటే విష్ణు ప్రియకు ఇష్టమని తన రహస్యాన్ని బయటకి చెప్పేసింది శ్రీముఖి.
అన్నట్టుగానే విష్ణు ప్రియ ఏ అని లెటర్ తో ఉన్న సూట్ కేసు ని తీసుకొని రాగా.. సుమ వెంటనే ఏ అని రాసి ఉన్న సూట్ కేసును ఎందుకు తీసుకు వచ్చావని ప్రశ్నించింది. ఇక దానికి ఏ అంటే ఎవరీ థింగ్ అని చెప్పి తప్పించుకుంది విష్ణు ప్రియ. కానీ అంతటితో ఆగకుండా సుమ పట్టుబడడంతో అఖిల్ అని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. అక్కినేని వారసుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని సుమ ప్రశ్నించగా అవును అని స్పందించింది.
ఇక సుమ తన పంచ్ డైలాగ్ తో నాగ చైతన్య, సమంతకు కుమారుడు పుడతాడు. అప్పటి వరకు ఆగి అప్పుడే పెళ్లి చేసుకో అంటూ కౌంటర్ వేసింది. కానీ విష్ణు ప్రియ.. చైతు తమ్ముడు అఖిల్ ఉన్నాడు కదా అంటూ అతని పై ఉన్న ప్రేమని బయటికి చెప్పేసింది. మొత్తానికి విష్ణు ప్రియా కు అక్కినేని అఖిల్ అంటే ఇష్టమని తెలియగా.. నిజంగా అఖిల్ తో పెళ్లి చేసుకునే అవకాశం వస్తే పెళ్లి చేసుకుంటుంది ఏమో అని పలురకాల కామెంట్స్ ఎదురవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor vishnu priya, Anchor vishnupriya hot yoga, Bigg boss telugu 3, Pove pora anchor vishnu priya, Sreemukhi, Vishnu Priya, విష్ణు ప్రియ, విష్ణు ప్రియ హాట్, శ్రీముఖి సినిమాలు, శ్రీముఖి హాట్, శ్రీముఖి హాట్ ఫోటోస్