Telugu Tv Serials TRP: టీఆర్పీ రేటింగ్‌తో దుమ్ములేపిన వంటలక్క..రెండు, మూడు స్థానాల్లో ఉండేది ఆ సీరియల్సే!

Premi viswanath

Telugu Tv Serials TRP: స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ ను అసలు మిస్ చేసుకోవట్లేదు. పైగా మొదటి నుంచి ఈ సీరియల్ అత్యధిక రేటింగ్ తోనే దూసుకెళ్తోంది.

  • Share this:
    Telugu Tv Serials TRP: స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ ను అసలు మిస్ చేసుకోవట్లేదు. పైగా మొదటి నుంచి ఈ సీరియల్ అత్యధిక రేటింగ్ తోనే దూసుకెళ్తోంది. గత కొన్ని రోజుల నుండి ఈ సీరియల్ బాగా ట్విస్టులతో కొనసాగుతుండగా అసలేం జరుగుతుందో అని ప్రేక్షకులు తెగ టీవీల ముందు వాలిపోవడంతో రేటింగ్ కూడా మొదటి స్థానంలో ఉంది. ఇలా ఉంటే తాజాగా మరోసారి రేటింగ్ తో దుమ్ము రేపింది కార్తీకదీపం సీరియల్. దీంతో ఈ వారం బుల్లితెరలో ప్రసారమవుతున్న సీరియల్స్ రేటింగ్ నమోదుకాగా అందులో కార్తీకదీపం సీరియల్ పోయిన వారం కంటే ఈ వారం మరింత ఎక్కువగా రేటింగ్ సంపాదించుకుంది. అర్బన్ లో 17.68 ఉండగా.. రూరల్ లో 17.03రేటింగ్ తో బాగా దూసుకెళ్లింది. ఇక ఈ సీరియల్ తర్వాత ఎప్పటిలాగే గృహలక్ష్మి, దేవత వంటి పలు సీరియల్స్ అదే షెడ్యూల్ ను ఫాలో అవగా కార్తీకదీపం కంటే చాలా రెట్లు తక్కువగా ఉందని తెలుస్తుంది.

    ఇక జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ ను చూస్తే అందులో త్రినయని సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.15, రూరల్ లో 8.65 లో ఉంది. ప్రేమ ఎంత మధురం సీరియల్ ఈసారి కాస్త వెనుకబడగా అర్బన్ లో 6.19, రూరల్ లో 7.91 రేటింగ్ తో నిలిచింది. అలాగే నెంబర్ వన్ కోడలు, రాధమ్మ కూతురు సీరియల్స్ కూడా రేటింగ్ లో సమానంగా ఉన్నాయి. ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ మాత్రం ఎప్పటిలాగానే ఉంది. అందులో ఎటువంటి మార్పు లేకపోగా మనసు మమత అర్బన్ లో 5.32, రూరల్ లో 4.29 ఉంది. ఇక నా పేరు మీనాక్షి అర్బన్ లో 5.63, రూరల్ లో 4.74 లో నిలిచింది.

    కానీ ఈటీవీలో సీరియల్స్ కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ షో లకు బాగా రేటింగ్ ఉంది. మరోవైపు జెమిని ఛానల్ ప్రేక్షకులను తమ సీరియల్స్ తో అంత మెప్పించలేక పోతుంది. దీంతో ఈసారి కూడా రేటింగ్ లో చాలా తక్కువగా ఉంది. ఇక ఓవరాల్ గా అన్ని ఛానల్స్ లో రేటింగ్ విషయంలో కార్తీకదీపం మొదటి స్థానంలో ఉండగా.. ప్రేమ ఎంత మధురం చివరిలో ఉంది.

    ఇక సినిమాలు, ఎంటర్టైన్మెంట్ షోల విషయం లోకి వస్తే బన్నీ నటించిన సరైనోడు సినిమాకు అర్బన్ లో 4.22, రూరల్ లో 4.96 లో ఉంది. దీనితో బన్నీ సినిమాకు ఇది షాపింగ్ రేటింగ్ అనే చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆషాడ మాసం సందర్భంగా పలు ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఎక్కువగా శ్రీముఖి హోస్టింగ్ చేసిన స్టార్ మా పరివార్ చాంపియన్షిప్ ఎక్కువ రేటింగ్ వచ్చింది. మొత్తానికి బుల్లితెర స్టార్ మా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
    Published by:Navya Reddy
    First published: