గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సీరియల్ నటి మంజీరా..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సీరియల్ నటి మంజీరా మొక్కలు నాటింది. 

news18-telugu
Updated: August 7, 2020, 2:27 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సీరియల్ నటి మంజీరా..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన టీవీ నటి (Twitter/Photo)
  • Share this:
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సీరియల్ నటి మంజీరా మొక్కలు నాటింది.  పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని ఆమె గుర్తు చేసారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు  బాధ్యత గా మొక్కలు నాటినందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.  దీనితో పాటు సీడ్ గణేష్ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపింది స్మాల్ స్క్రీన్ నటి మంజీరా. టీవీ నటుడు అనిల్ అల్లంవిసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ అత్తాపూర్ లోని తన నివాసంలో మొక్కలు నాటింది మంజీరా. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అనంతరం తాను ఇంస్టాగ్రామ్ వేదిక ద్వారా మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతానని సీరియల్ నటి మంజీర తెలిపారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 7, 2020, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading