టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులకు వీడియో కాల్ చేసి మరి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది. తనకు పోలీసులు న్యాయం చేయడం లేదంటూ ఆరోపిస్తూ... పోలీసులకే వీడియో కాల్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సీరియల్ నటి మైథిలీ, తన భర్త తో కలిసి ఎస్ ఆర్ నగర్ పరిసర ప్రాంతంలో నివాసముంటుంది.
గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో గతంలో కూడా మైథిలి ఒకసారి పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఏదో విధంగా సర్దిచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఇక తాజాగా ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తాను కొనుక్కున్న కారును బలవంతంగా తీసుకున్నాడని ఆమె ఆరోపించింది. అడిగినా కూడా ఇవ్వడం లేదని భర్తపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపడతామన్నారు.
అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన ఆమె తనకు న్యాయం జరగలేదంటూ పోలీసులకు వీడియో కాల్ చేసి లైవ్ సూసైడ్ చేసుకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమె ఇంటికి చేరుకొని ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఇక మైథిలీ పలు తెలుగు సీరియల్స్ లోను నటించినట్లు సమాచారం.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.