Home /News /movies /

TELUGU TV SERIAL ACTOR TESTS CORONA POSITIVE UNIT MEMBERS SENT TO QUARANTINE AK

టీవీ సీరియల్ నటుడికి కరోనా.. తిరుపతి నుంచి నేరుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరుపుతున్నా.. ఓ టీవీ సీరియల్ నటుడికి కోవిడ్ 19గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.

    కరోనా సంక్షోభం కారణంగా రెండు నెలలకు పైగా వాయిదా పడిన సీరియల్స్ షూటింగ్స్ ఇటీవలే మళ్లీ మొదలయ్యాయి. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరుపుతున్నా.. ఓ టీవీ సీరియల్ నటుడికి కోవిడ్ 19గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో... వెంటనే షూటింగ్స్ నిలిపేశారు నిర్మాతలు. చిత్ర యూనిట్ మొత్తాన్ని క్వారంటైన్‌కు తరలించారు. అయితే ఆ సీరియల్ నటుడు తిరుపతి నుంచి నేరుగా షూటింగ్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఎవరికి వాళ్లు తమ ఆరోగ్యం బాగా ఉందని చెప్పడంతో షూటింగ్స్ మొదలుపెడుతున్న సీరియల్ నిర్మాతలకు తాజా పరిణామం షాక్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    పరిమిత సంఖ్యలో సిబ్బందిని పెట్టుకుని సీరియల్స్, సినిమా షూటింగ్స్ నిర్వహించుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అయితే సినిమా షూటింగ్స్ పెద్దగా జరగకపోయినా... టీవీ సీరియల్స్ షూటింగ్స్ మాత్రం మొదలయ్యాయి. బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు మేం సిద్ధమవుతున్నాం అని అనేక సీరియల్స్ ప్రకటించాయి. ఈ తరుణంలో ఓ ప్రముఖ టీవీ సీరియల్‌లో నటించే నటుడికి కరోనా రావడం బుల్లితెర వర్గాల్లో కలకలం రేపుతోంది.



    First published:

    Tags: Coronavirus, Telugu tv serials

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు