TRP Shows: బుల్లితెరలో ఒకప్పుడు ప్రసారమైన షోలకు ఇప్పుడు ప్రసారమవుతున్న షోలకు చాలా మార్పులు ఉన్నాయి. నిజానికి అప్పట్లో ప్రసారమైన షోలు.. ఎంతో పద్ధతిగా కనిపించే యాంకర్ల తో ఉంటూ మంచి మాటలతో కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదు. అసలు అప్పటి షోలకు ఇప్పుడు షోలతో పోలిక చేయడం పెద్ద తప్పనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న షో లలో ఎంటర్టైన్మెంట్ పక్కనపెడితే టిఆర్పీ కోసం ఏమైనా చేస్తున్నారు.. ఎంతటి దానికైనా దిగజారుతున్నారు.
ఇప్పుడు చాలా షోలలో తమ రేటింగ్ కోసం ఫ్రాంక్ లు బాగా చేస్తున్నారు. నిజానికి అందులో పాల్గొనే కంటెస్టెంట్ ఎవరు కూడా వాళ్ల భవిష్యత్తుని ఆలోచించకుండా దేనికైనా సిద్ధంగా ఉంటున్నారు. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, కామెడీ స్టార్స్ వంటి పలు ఎంటర్టైన్మెంట్ షో లన్ని ప్రేక్షకులను బకరాలు చేస్తున్నాయి. పైగా అందులో ఒక ఫిమేల్, మేల్ జంటను చేసి షో మొత్తం వారితోనే నడిపిస్తున్నారు.
జబర్దస్త్ లో సుధీర్, రష్మీ ల మధ్య లవ్ నడుస్తున్నట్లు అంతేకాకుండా వాళ్లు కూడా అంతే ఓపెన్ గా మాట్లాడుకోవడం, ఒకరిమీద ఒకరు వాలిపోవడం లాంటివి చేయడంతో పాటు.. గతంలో వీరిద్దరి పెళ్లి బుల్లితెర వేదికగా చేయగా ఈ పెళ్లిని చూసిన ప్రేక్షకులకు వీరి మధ్య నిజంగా పెళ్లి జరిగిందా అని నోరెళ్లబెట్టారు. కానీ బయట వీళ్లు చెప్పే ఇంటర్వ్యూలలో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమని, రేటింగ్ కోసమని అలా చేస్తామని నేరుగా చెప్పేస్తున్నారు.
అంతేకాకుండా మరికొన్ని జంటలతో కూడా పలు షోస్ ఇలాగే చేయించగా అందులో రవి-లాస్య, హైపర్ ఆది-అనసూయ, రవి-శ్రీముఖి, సుధీర్-విష్ణు ప్రియ, సుధీర్- వర్షిణి వీళ్లే కాకుండా ఈమధ్య జబర్దస్త్ లో మరో జంట ఇమాన్యుల్- వర్ష లు ఏకంగా ముద్దులతో, హాగ్ లతో బాగా రెచ్చిపోతున్నారు. ఇటీవల ఈ జంట పెళ్లి కూడా ఎంతో ఘనంగా చేయగా చివరికి ఇదంతా షో రేటింగ్ కోసం చేశారని బయటపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Comedy stars, Dhee show, Jabardasth, Social Media, Sridevi drama company, TRP shows, TV channels