TELUGU TV ANCHORS SREEMUKHI VISHNU PRIYA DANCE GO VIRAL ON SOCIAL MEDIA TA
శ్రీముఖి, విష్ణు ప్రియ డ్యూయట్ సాంగ్.. ఏంటిది అంటున్న నెటిజన్స్..
శ్రీముఖి, విష్ణుప్రియ డాన్స్ (Youtube/Credit)
శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టీవీతెరమీదకు అడుగులేసింది. తాజాగా వీళ్లిద్దరు కలిసి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈటీవీ ప్లస్‌లో వచ్చే పటాస్ షోతో బాగా పాపులర్ అయింది ఈ భామ. అక్కడ వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచింది. కేవలం రియాలిటీ షోస్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపించి తన లక్‌ను పరిక్షించుకుంది. అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టీవీతెరమీదకు అడుగులేసింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వీళ్లిద్దరు తాజాగా లాక్డౌన్ నేపథ్యంలో ఇద్దరు కలిసి తెలుగు పాటలకు స్టెప్పులు వేసారు.
ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలకు వీళ్లు చేసిన డాన్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీముఖి హీరోయిన్గా, విష్ణుప్రియ హీరో లెవల్లో ఫోజులిస్తూ.. ఆయా పాటలకు తమ స్టెప్పులతో ఇరగదీసారు. సోషల్ మీడియాలో కొంత మంది వీళ్లిద్దరి స్టెప్పులకు ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు ఇదంతా అవసరమా అంటున్నారు. ఏమిటి గోల అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా లాక్డౌన్లో నేపథ్యంలో హాయిగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయోచ్చన్న మెసేజ్ ఇచ్చారు శ్రీముఖి విష్ణు ప్రియ.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.