స్మాల్ స్క్రీన్ యాంకర్‌లకు వచ్చే పాపులారిటీ.. ఆదాయం వెండితెర భామలను మించి పోతున్నారు. తెలుగు టీవీ యాంకర్ అనగానే.. మొదట మనకు గుర్తుకు వచ్చేది సాంప్రదాయ యాంకర్ సుమ. ప్రస్తుతం యాంకర్‌గా ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిన విషయమే. సుమ టీవీ షోలతో పాటు.. సినీ ఈవెంట్ల ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యింది. హైదరాబాద్‌లో జరిగే ఏ ఈవెంట్‌కి అయినా సుమ ఉండాల్సిందే. టాప్ టెన్ హీరోల సినీమా వేడుకలు ఏదైనా కావొచ్చు యాంకర్‌గా సుమ ఉండాల్సిందే..అయితే ఈ మధ్య కాలంలో యాంకర్లు సినిమా హీరోయిన్ల కంటే మరింత గ్లామర్ గా కనిపిస్తున్నారు. సినిమాలయితే సంవత్సరానికి ఒకటే వస్తుంది.. షో లు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అలాంటి యాంకర్లు ఈ షోలలో నటిస్తూ హాట్ అందాలను హీరోయిన్ల కంటే ఎక్కువగా ఆరబోస్తూ వస్తున్నారు. వీళ్లకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే అని చెప్పాలి. అలా ఒక్క్కో మెట్టు ఎదుగుతూ ఇటు సినిమాలలో అటు స్మాల్ స్క్రీన్ పై తమ హవాను కొనసాగిస్తూ వస్తుంటారు. జబర్దస్త్ షో తో అవకాశాన్ని అందిపుచ్చుకున్న యాంకర్ అనసూయ, రష్మిలు టాప్ సెలబ్రిటీలు అయ్యారంటే దానికి కారణం జబర్దస్త్ అనే చెప్పాలి.
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లు అంతలా క్లిక్ కావడంతో ఈ హాట్ యాంకర్స్ పాత్ర కూడా ఉండనే ఉంది. తమ హాట్ నెస్‌తో షోకి గ్లామర్ హంగులు అద్దడమే కాకుండా స్పెషల్ సాంగ్‌లు, స్కిట్‌లతో రచ్చ చేసి ‘జబర్దస్త్’కి జబర్దస్త్ రేటింగ్ అందిస్తున్నారు.అయితే జీ లో ప్రసారమయ్యే ‘అదిరింది’ కామెడీ షోకి గ్లామరస్ యాంకర్‌గా సమీర వ్యవహరిస్తున్నారు. ఆమె పాపులర్ సెలబ్రిటీ కాకపోవడం.. అనసూయ, రష్మిల రేంజ్‌లో గ్లామరస్ యాంకర్ కాకపోవడం కూడా ఆ షో మైనస్‌గా మారింది అనుకుంటున్నారు.అయితే అనుభవమే ఆమెకు పాఠాలు నేర్పిస్తుంది అనేవాళ్ళు లేకపోలేదు. ఇదిలావుంటే జబర్దస్త్ లో హాస్యం కంటే మసాలా ఎక్కువవుతోందనే విమర్శలు వినిపిస్తుంటాయి. ఏదేమైనా జబర్దస్ యాంకర్స్ యాంకరింగ్ తో పాటు గ్లామర్ కూడా ఈ షోకు ప్లస్ అనే చెప్పుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Anchor suma, Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood