తెలుగు టెలివిజన్ టాప్ యాంకర్స్ అనసూయ భరద్వాజ్, సుమ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరి ఈ నిర్ణయానికి కారణం కరోనా వైరస్ అని చెబుతున్నారు. రీసెంట్గా అమితాబ్ బచ్చన్‌తో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోవిడ్ బారిన పడ్డారు. దీంతో బాలీవుడ్ నుంచి అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సనాలిటీస్ అందరూ వణికిపోతున్నారు. మొదటి నుంచి కరోనా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ చెబుతూ వచ్చినా.. బిగ్‌బీనే కరోనా కాటు వేయడంతో మిగతా ఆర్టిస్టుల్లో కరోనా భయం పట్టుకుంది. ఇక అమితాబ్ బచ్చన్.. కౌన్ బనేగా కరోడ్ పతి షో కోసం చేసిన ఆడిషన్స్ లో పాల్గొనడం వల్లే ఆయనకు కరోనా వచ్చిందనే వార్తలు ఇపుడు టెలివిజన్ ఇండస్ట్రీని భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో చాలా మంది సెలబ్రిటీలు ఇపుడు చేస్తోన్న టీవీ ప్రోగ్రామ్స్‌తో పాటు సీరియల్స్‌కు కొంత కాలం బ్రేక్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ టాప్ స్టార్స్.. ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినా.. వీళ్లు మాత్రం కోవిడ్‌కు మందు వచ్చిన తర్వాత కానీ షూటింగ్స్‌లో పాల్గొనబోమని తెగేసి చెప్పినట్టు సమాచారం.
ఇపుడు అమితాబ్ బచ్చన్ వంటి టాప్ స్టార్ హీరోకు సైతం కరోనా సోకడంతో తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు టెలివిజన్ ఇండస్ట్రీలోని పలువురు ఇపుడు చేస్తోన్న షూటింగ్స్‌కు తాత్కాలంగా గుడ్ బై చెబుతునున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ యాంకర్స్ అయిన అనసూ, సుమ ప్రస్తుతం తాము చేస్తోన్న షూటింగ్స్‌కు గుడ్ బై చెప్పారట. ఇప్పటికే టీవీ పరిశ్రమలో పలువురుని కరోనా సోకింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు షూటింగ్స్ గట్రా చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వీళ్ల బాటలోనే చాలా మంది యాంకర్స్‌తో పాటు ప్రోగ్రామ్ నిర్వాహకులు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Anchor suma, Corona virus, Covid-19, Tollywood