‘ఓటు వేయండి’ అని చెప్పిన నాగార్జున... అంత పని చేశాడా ?

నాగ్ భార్య అమల, కొడుకు చైతు, కోడలు సమంత మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

news18-telugu
Updated: April 15, 2019, 7:56 AM IST
‘ఓటు వేయండి’ అని చెప్పిన నాగార్జున... అంత పని చేశాడా ?
నాగార్జున
news18-telugu
Updated: April 15, 2019, 7:56 AM IST
దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడియే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఓటింగ్‌కు ప్రతీ ఒకరు పిలుపునిచ్చారు. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అంతా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్, కోలివుడ్, టాలీవుడ్‌లో పలు ప్రముఖులంతా తమ సోషల్ మీడియాలో ఎకౌంట్లలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ ఎఫెక్ట్‌తోనే ఈ మధ్యకాలంలో యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటుంది. మోదీ కొందమందికి ఈ బాధ్యతను అప్పగించారు. మన టాలీవుడ్ విషయానికి వస్తే... కింగ్ నాగార్జున ఈ క్యాంపెయిన్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న నాగ్... లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఓటు వేయలేదు. ఆ సమయంలో ఆయన తను నటిస్తున్న మన్మథుడు సినిమా షూటింగ్‌కు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఓటింగ్‌లో పాల్గొనకుండా పోర్చుగల్ ఫ్లైట్ ఎక్కారు.

అయితే నాగర్జున చేసిన ఈ పనికి అభిమానులంతా ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో విమర్శలు అందుకున్నారు. ఓటు వేయాలని చెప్పేవారు... ఓటు వేయరా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇతరులకు చెప్పేందుకు నీతులున్నాయంటూ మరికొందరు నాగ్‌‌కు చురకలంటిస్తున్నారు. అదే సమయంలో నాగ్ భార్య అమల, కొడుకు చైతు, కోడలు సమంత  మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...