సినిమాలకు దూరం కానున్న తెలుగు టాప్ హీరోయిన్స్.. కారణం అదేనా..

తెలుగు టాప్ హీరోయిన్స్ సినిమాలకు దూరం అవుతున్నారా.. అంటే కాస్తా అటూ ఇటూగా అదే అనిపిస్తోంది.

news18-telugu
Updated: October 12, 2019, 7:08 AM IST
సినిమాలకు దూరం కానున్న తెలుగు టాప్ హీరోయిన్స్.. కారణం అదేనా..
Instagram
  • Share this:
తెలుగు టాప్ హీరోయిన్స్ సినిమాలకు దూరం అవుతున్నారా.. అంటే కాస్తా అటూ ఇటూగా అదే అనిపిస్తోంది. కాజల్, సమంత, అంజలి, సినీయర్ హీరోయిన్ రమ్యక‌ృష్ణ డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాజల్ అగర్వాల్.. తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగు సినిమాకు పరిచయమైనా..క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ 'చందమామ' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. వరుసగా సినిమాలు చేస్తూ.. దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. తెలుగులో దాదాపు అందరీ హీరోలతో నటించింది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.  ప్రస్తుతం కాజల్‌కు సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో కొత్తగా కొంగొత్తగా కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దీనికి తోడు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. అందులో భాగంగా ఇండియాలో ప్రస్తుతం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు.. ఈ సంస్థలు సొంతంగా కాంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటినే మనం ఒరిజనల్స్‌గా పిలుస్తున్నాము.

ఈ ఒరిజనల్స్‌లో హిందీలో కియారా అద్వానీ నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్‌లు చేస్తూ అటూ డిజిటల్‌లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతున్నారు. తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది. ఆ మధ్య జగ్గుబాయ్ అమెజాన్ వెబ్ సీరిస్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.  తాజాగా కాజల్, కూడా ఈ వెబ్ సిరీస్ చేయనున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఓ  తమిళ వెబ్‌సిరీస్‌లో అందాల కాజల్ నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. కాగా మొదట తమిళంలో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్ ఆ తర్వాత తెలుగులోకి కూడా విడుదల కానుంది. మరో వైపు తెలుగు టాప్  హీరోయిన్ సమంత, అంజలి కూడా ఓ కూడా వెబ్‌సిరీస్‌లో నటించనుందని తెలుస్తోంది. సినీయర్ నటి రమ్యకృష్ణ కూడా నటి, రాజకీయ నాయకులు జయలలిత కథతో వస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్ర పోషిస్తోంది.
View this post on Instagram

Wishing you all a very #happydussehra ☺️

A post shared by Anjali (@yours_anjali) on

First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>