కరోనా కష్టాలు మాములుగా లేవుగా.. కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమా ఇండస్ట్రీ. కరోనా మూలంగా గత కొన్ని రోజులుగా థియేటర్స్‌తో పాటు షూటింగ్స్ గట్రా ఆగిపోయాయి. ఇపుడిపుడే ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వడంతో మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే కొన్ని డేలీ సీరియల్స్‌తో పాటు జబర్ధస్త్ వంటి కొన్ని రియాలటీ షోస్ షూటింగ్స్ మొదలయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలుగా ఖాళీగా ఉన్న టీవీ ఆర్టిస్టులు, యాంకర్లు ఇపుడు బిజీ అయ్యారు. తెలుగులో టాప్ యాంకర్స్ అయిన అనసూయ, రష్మీ, సుమ వంటి యాంకర్స్ నిన్నటి మొన్నటి వరకు కొద్ది మంది హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఉండేది వీళ్ల సంపాదన. ప్రస్తుతం కరోనా కారణంగా వీరు వాళ్ల పారితోషకాన్ని సగానికి తగ్గించినట్టు సమాచారం. ఇప్పటి వరకు తీసుకునే దానికంటే సగమే వారికి పేమెంట్స్ చేస్తున్నారు. కరోనా తగ్గి మాములు పరిస్థితులు నెలకొన్న తర్వాత వీరికి యదావిధిగా వీరికి పేమెంట్స్ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. అటు శ్రీముఖి, మంజూషలది కూడా ఇదే పరిస్థితి. అంతేకాదు భవిష్యత్తులో వీళ్లు చేసే ప్రోగ్రామ్స్‌కు టీఆర్పీ రేటింగ్ పెరిగితేనే అంటూ కండిషన్స్ పెట్టినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Anchor suma, Rashmi Gautam, Telugu Cinema, Tollywood