బిగ్‌బాస్ పై తెలుగు యాంకర్ షాకింగ్ కామెంట్స్..

తెలుగులో ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ పై తెలుగు యాంకర్ షాకింగ్ కామెంట్స్ చేసారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 16, 2020, 9:24 PM IST
బిగ్‌బాస్ పై తెలుగు యాంకర్ షాకింగ్ కామెంట్స్..
బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
  • Share this:
తెలుగులో ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ పై తెలుగు యాంకర్ షాకింగ్ కామెంట్స్ చేసారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో బిగ్‌బాస్ 4పై షో రియాలిటీ షోపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటి కిప్పుడు ఈ మహామ్మారి తగ్గినా.. ప్రజలు అంత త్వరగా సినిమా థియేటర్స్‌ వైపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎంత లేదన్న ఈ ఎఫెక్ట్ వచ్చే సంక్రాంతి వరకు ఉండే అవకాశాలున్నాయని సినిమా రంగానికి చెందిన ప్రముఖులే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా టీవీలకు వచ్చే కమర్షియల్ యాడ్స్ తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరు పొందిన బిగ్‌బాస్ ఈ యేడాది లేనట్టేనని స్మాల్ స్క్రీన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనలు కారణంగా ఒకేచోట ఎక్కువ మంది ఉండి చేసే ఈ ప్రోగ్రామ్స్ కు ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

telugu top anchor shocking comments on bigg boss 4,bigg boss 4,bigg boss,jhansi,jhansi shocking comments on bigg boss 4,బిగ్‌బాస్ 4పై ఝాన్సీ షాకింగ్ కామెంట్స్bigg boss corona virus,corona virus,jr ntr bigg boss season 4,bigg boss 4 nagarjuna,bigg boss 4 mahesh babu,bigg boss 4,nagarjuna bigg boss host,nani bigg boss host,bigg boss telugu,bigg boss,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss telugu season 3,bigg boss 3 telugu host,bigg boss 3 telugu contestants list,jr ntr,bigg boss season 2,bigg boss 3 telugu latest news,bigg boss 3 telugu contestants,bigg boss 3 host nagarjuna,bigg boss telugu season 2,nagarjuna,bigg boss telugu season 3 host,nagarjuna in bigg boss,telugu bigg boss,telugu bigg boss 3,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 హోస్ట్,జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 3,రాజమౌళి సినిమాతో ఎన్టీఆర్ బిజీ,బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్,తెలుగు సినిమా, ఎన్టీఆర్,బిగ్‌బాస్ 4 సీజన్ నాగార్జున హోస్ట్,కరోనా ఎఫెక్ట్,కోవిడ్ 19 బిగ్‌బాస్ 4,ఝాన్సీ
బిగ్‌బాస్ పై ఝాన్సీ షాకింగ్ కామెంట్స్ (Twitter/Photo)


ఒకవేళ ఈ మహామ్మారి డిసెంబర్ వరకు తగ్గితే.. బిగ్‌బాస్ 4 పై స్టార్ మా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాజాగా ఈ షోపై తెలుగు యాంకర్ కమ్ నటి ఝాన్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఈమె అభిమానులతో చిట్‌ చాట్ సందర్భంగా ఈ షోపై కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఒక వేళ మీకు బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా అవకాశం వస్తే వెళ్తారా అనే దానికి .. నాకు ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టింది. అంతేకాదు అంతకు ముందు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజర్ 1లోనే అవకాశం వస్తేనే పోలేదు. ఇపుడు వెళ్తానా.. తెలిసి తెలిసి రాయి పట్టుకొని పళ్లను ఊడకొట్టుకుంటామా అంటూ బిగ్‌బాస్ పై సెటెర్లు వేసింది. నాలుగు గోడల మద్య నన్ను నేను బాధ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదని కూడా తెగేసి చెప్పేసింది.  ప్రస్తుతం ఝాన్సీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
First published: May 16, 2020, 9:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading