తెలుగు తమిళ హీరో విశాల్, నటి అల్ల అనీశా రెడ్డితో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలో వీరి వివాహ వేడుక కూడా జరగబోతోంది. అనీశా రెడ్డి..పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి చిత్రాల్లో విజయ్ దేవరకొండకు స్నేహితురాలుగా.. కీలక పాత్ర పోషించారు. త్వరలో పెళ్లి చేసుకోనున్న ఈ జంట.. ప్రస్తుతం టర్కీలో విహారం చేస్తోంది. తమిళ డైరెక్టర్.. సుందర్. సి దర్శకత్వంలో విశాల్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రస్తుతానికి టర్కీలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే..ఆ సినిమాలో ఓ యాక్షన్ సీన్ చేస్తూ..విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన కాలుకి, చేతికి బలమైన గాయాలయ్యాయి.
దీంతో అక్కడికి వెళ్లిన అనీశా ఖాళీ సమయంలో తనకి కాబోయే భర్తతో కలిసి టర్కీ వీధుల్లో సందడిచేస్తోంది. దానికి సంబందించిన ఫోటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arjun Reddy, Tamil Cinema, Telugu Cinema, Vijay Devarakonda, Vishal