హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: మరోసారి గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు

Mahesh Babu: మరోసారి గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు

Super Star Mahesh Babu to work with that female director

Super Star Mahesh Babu to work with that female director

గతేడాది.. మహేశ్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. వివిధ వ్యాధులతో బాధపడుతున్న 1000 మంది చిన్న పిల్లలకు సర్జరీలు చేయించడానికి ముందుకొచ్చారు.

 • News18
 • Last Updated :

  టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అవసరార్థులను ఆపన్న హస్తం అందిస్తున్న ఆయన.. తాజాగా ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించారు. ఈ విషయాన్ని ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ స్వయంగా వెల్లడించారు. గతేడాది.. మహేశ్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. వివిధ వ్యాధులతో బాధపడుతున్న 1000 మంది చిన్న పిల్లలకు సర్జరీలు చేయించడానికి ముందుకొచ్చారు.

  కాగా... తాజాగా గుండెలో సమస్యతో బాధపడుతున్న ఓ పాపకు మహేశ్ బాబు శస్ర్త చికిత్స చేయించారు. ఉమా అనే పాపకు ఈ ఆపరేషన్ జరిగింది. ఈ సందర్భంగా నమ్రత శిరోద్కర్ స్పందిస్తూ... ‘ఈ క్రిస్టమస్ కు నవ్వులు విరబూస్తాయి. ఉమా శస్త్ర చికిత్స విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది. ఆ పాపకు గత వారం ఆపరేషన్ చేశారు. ఆంధ్ర హాస్పిటల్స్ తో అసోసియేట్ అయినందుకు గర్వంగా ఉంది. ఆ పాపతో పాటు వారి కుటుంబం కూడా ఇకపై ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..’ అని Instagram లో పోస్ట్ చేశారు. ఆ పాపతో పాటు తల్లిదండ్రులున్న ఫోటోను కూడా దానికి జత చేశారు.  గత కొంతకాలంగా మహేశ్ బాబు.. ఉచితంగా చేయించిన ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాటలో నటిస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Instagram, Mahesh babu, Mahesh Babu Latest News, Namratha Shirodkar, Tollywood, Tollywood news

  ఉత్తమ కథలు