Baby Krithika: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ తెలుగు రాష్ట్రాలలో ఎంతలా పాకిందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ వలలో ఇరుక్కున్నారు. ఇక ఇందులో నటించే నటులు కూడా తమ పాత్రలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సీరియల్ ఒకే కథతో ఎన్నో రోజుల నుండి సాగుతూ ఉండగా తాజాగా కొత్తదనంతో ఆసక్తిగా మారింది.
ఇందులో దీప, కార్తీక్ లు మొత్తానికి కలిసిపోగా ఈ సమయంలో మళ్లీ ఎలాంటి ట్విస్ట్ లు చూడాల్సి వస్తుందో అని ప్రేక్షకులు భయపడుతున్నారు. మొత్తానికి ఈ సీరియల్ డైరెక్టర్ ఇప్పటివరకు ఎన్నో సడన్ షాక్ లతో సాగించగా.. ఇప్పుడు మళ్లీ డైరెక్టర్ మోనిత తో ఎలాంటి షాక్ ఇప్పిస్తాడో అనుకుంటున్నారు. ఇక తాజాగా ఇందులో రౌడీ పిల్లగా పేరు సంపాదించుకున్న సౌర్య తన పాత్రతో మంచి గుర్తింపు అందుకుంది. తన అల్లరితో, ప్రశ్నలతో బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సౌర్య ఈ సీరియల్ డైరెక్టర్ అంటే భయమంటుంది.
సౌర్య అసలు పేరు కృతిక. ఈ సీరియల్ ద్వారా బాగా మెప్పించిన కృతిక వెండితెర పై కూడా అవకాశం అందుకుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ అల్లరి పిల్ల సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాకుండా మంచి ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలతో, డాన్స్ స్టెప్పులతో ఫిదా చేస్తుంది కృతిక.
ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదిక ఓ వీడియో షేర్ చేసుకోగా.. అందులో ఈ మధ్య బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఉప్పెన వీడియోతో ఓ స్పూఫ్ చేసింది. అందులో నీళ్ళంటే భయమా, నాన్న అంటే భయమా అనే ప్రశ్నకు మా కార్తీకదీపం డైరెక్టర్ అంటే భయం అంటూ ఓ కామెడీ పంచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారగా తెగ కామెంట్స్ వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Instagram reel, Karthika deepam, Telugu serial, Viral Video, కార్తీక్, కార్తీక్ దీపం డైరెక్టర్, కృతిక, దీప, సౌర్య